Suriya 43: ఇక రచ్చే.. హీరో సూర్య నయా మూవీ అప్డేట్.. సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.. !
విభిన్న కథలను ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు మాస్ మసాలా పాత్రలు చేస్తూనే మరోవైపు 'జై భీమ్', 'సురారై పోట్రు'( ఆకాశం నీహద్దురా )లాంటి సమాజంలో స్ఫూర్తి నింపే సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను ఓకే చేశాడు. గతంలో సూర్య నటించిన ఆకాశం నీహద్దురా సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ప్రముఖ తమిళ నటుడు సూర్య కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతోన్న విజయ్, అజిత్, కమల్, రజినీకాంత్ లా కాకుండా తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు మాస్ మసాలా పాత్రలు చేస్తూనే మరోవైపు ‘జై భీమ్’, ‘సురారై పోట్రు'( ఆకాశం నీహద్దురా )లాంటి సమాజంలో స్ఫూర్తి నింపే సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను ఓకే చేశాడు. గతంలో సూర్య నటించిన ఆకాశం నీహద్దురా సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. కానీ ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పుడు మరోసారి ఇదే దర్శకురాలితో కలిసి సినిమా చేస్తున్నాడు సూర్య. సురారై పోట్రు’ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగర మరోసారి సూర్యకు ఓ సినిమా చేయనుంది. కన్నడిగుల కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా ‘సురరై పోట్రు’ సినిమాతో సంచలనం సృష్టించిన ఈ కాంబో మరోసారి అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యతో పాటు మరో ఇద్దరు స్టార్స్ కూడా కనిపించనున్నారు.
సుధా కొంగర, సూర్య కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ రేసులోకి వచ్చిన ఈ సినిమా పలు విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం అలాగే ఉత్తమ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు అదే ‘సురారై పోట్రు’ టెక్నీషియన్ టీమ్ కొత్త సినిమా పని చేయనున్నారు. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. మలయాళ సినిమా నుంచి వచ్చి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేసిన హీరో దుల్కర్ సల్మాన్, మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పురాణనూర్’ అని పేరు ఖరారు చేశారు.
సినిమాకు ‘పురాణనూర్’ అని పేరు పెట్టినా, ఇది సినిమా పూర్తి పేరు కాదు. సినిమా టైటిల్ కార్డ్‌లో సినిమా పేరు ఫస్ట్ హాఫ్ రివీల్ కాలేదు. సినిమా పూర్తి పేరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అని అర్ధమవుతోంది. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య భార్య జ్యోతిక, సూర్య, రాజశేఖర్ కర్పూర్, సుందరపాండియన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మ్యూజిక్ మాస్ట్రో జివి ప్రకాష్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. మరో విశేషమేమిటంటే ఇది జి.వికి 100వ సినిమా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




