Preity Zinta: రూ.17 కోట్లకు విలాసవంతమైన ఇళ్లు కొన్న స్టార్ హీరోయిన్.. ఆ బాలీవుడ్ హీరో ఇంటి పక్కనే ?..
ప్రీతి జింటా చివరిసారిగా 2018లో భయ్యాజీ సూపర్‌హిట్‌లో కనిపించింది. ఆమె ఫిబ్రవరి 2016 లో వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్‌తో ఏడడుగులు నడిచింది. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తోంది ప్రీతి. వీరికి 2021లో కవలలు గియా, జైల జన్మించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రీతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ రూ. 17.01 కోట్లతో కొత్త అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసినందట.
తెలుగు సినీ పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. రాజకుమారుడు సినిమాతో తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా సినిమాతో హిట్ అందుకుంది. ఇటు తెలుగు, అటు హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. ప్రీతి జింటా చివరిసారిగా 2018లో భయ్యాజీ సూపర్‌హిట్‌లో కనిపించింది. ఆమె ఫిబ్రవరి 2016 లో వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్‌తో ఏడడుగులు నడిచింది. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తోంది ప్రీతి. వీరికి 2021లో కవలలు గియా, జైల జన్మించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రీతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ రూ. 17.01 కోట్లతో కొత్త అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసినందట. ఇకపై ఆమె భారతదేశానికి తిరిగి రానుందనే ఊహాగానాలకు దారితీసింది.
నివేదికల ప్రకారం.. ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందట ప్రీతి. గతంలో ఆమె నివాసం ఉండే భవనంలోనే ఈ భవనం ఉన్నట్లు సమాచారం. సొగసైన కొత్త అపార్ట్‌మెంట్ 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రెండు రిజర్వ్ చేయబడిన పార్కింగ్ స్పాట్‌లను కలిగి ఉంది. ఈ అపార్ట్ మెంట్ కు స్టాంప్ డ్యూటీ కింద రూ.85.07 లక్షలు చెల్లించింది. పెళ్ళి తర్వాత భర్త, పిల్లలతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తోన్న ప్రీతి ఇప్పుడు మళ్లీ ముంబైలో ఆస్తులు కొనుగోలు చేయడం చూస్తుంటే.. తిరిగి ఆమె భారతదేశంలోనే స్థిరపడుతుందని అంటున్నారు.
View this post on Instagram
ముంబై బాంద్రాలోని పాలి హిట్-ఓషివారాలోని సిగ్నేచర్ భవనం ప్రత్యేకంగా పలువురు ప్రముఖులను ఆకర్షించింది. ఇప్పటికే అక్కడ ఒక ఆస్తిలో నటుుడు మనోజ్ బాజ్ పేయి రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. సెప్టెంబర్ లో అమితాబ్ బచ్చన్ ఓషివారాలోని ఓ వాణిజ్య ప్రాజెక్టులో దాదాపు 8.400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు కార్యాలయ స్థలాలను దాదాపు రూ.29 కోట్లకు కొనుగోలుచేశారు. ఇప్పుడు ప్రీతి సైతం అమితాబ్ ఇంటి పక్కనే ఈ అపార్ట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అజయ్ దేవగన్, కాజోల్, ఇతర బాలీవుడ్ సెలబ్రెటీలు బాంద్రాలో ఆఫీస్ స్పేస్ లలో అనేక పెట్టుబడులు పెట్టారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.