Malli Modalaindi: విడాకుల గురించి కథ ఉంటుంది అనగానే నచ్చేసింది.. హీరో సుమంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
'మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.
Malli Modalaindi: ‘మళ్ళీ రావా” వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ నెల 11న సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రే రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువహీరోలు నికిల్ సిద్దార్థ,సుశాంత్,అడవి శేష్, విశ్వక్ సేన్, నిర్మాత బన్నీ వాసు, డి.జె టిల్లు దర్శకుడు విమల్ తదితర సినీప్రముఖులు పాల్గోని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ.. కథ చెప్పేటప్పుడు విడాకులు గురించి చెప్పడంతో ఈ కథ నాకు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము.అనూప్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రేమకథ దగ్గర్నుంచి నా ప్రతి సినిమాకు ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఆలోన్. ఆలోన్ అనే పాట కూడా సిగ్నేచర్ సాంగ్ అవుతుంది. ఫిబ్రవరి11న జి5 లో మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా ను సబ్స్ క్రైబ్ చేసుకొని చూడండి అన్నారు.
హీరో అడవి శేషు మాట్లాడుతూ .నాకు టైటిల్స్ చూసి ఇంప్రెస్స్ అవుతాను.. నాకు ఇష్టమైన లవ్ స్టోరీ “మళ్లీ రావా” ఆ సినిమాలు చాలాసార్లు చూశాను “మళ్లీ రావా ” హిట్ తో మళ్లీ అనేది జోడించి “మళ్ళీ మొదలైంది” టైటిల్ తో వచ్చాడు నాకు ఈ టైటిల్ కూడా కనెక్ట్ అయ్యింది ట్రైలర్ బాగుంది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు.ఈ సినిమా సుమంత్ కు మంచి విజయం సాదించాలని కోరుతున్నాను అన్నారు.అలాగే హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ కథ నాకు ముందే తెలుసు..ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. రాజన్న, సీఈవో తేజ్ ఉప్పలపాటి .వీరు మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తారు.వీరు ఇలాగే అనేక మంచి సినిమాలు తీయాలని అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..అందరికీ రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారు. రాజశేఖర్ గారికి సుమంత్ కి హీరోయిన్లకి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు
Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..