మంచువారి ఇంట్లో.. ప్రభాస్ ఏం చేస్తున్నాడు..?

మంచు విష్ణు ఇంట్లో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. అయితే.. సాధారణంగా.. వారు ఏ పార్టీల్లోనో.. లేక టాలీవుడ్ ఏర్పాటు చేసిన.. షోలలో కానీ.. లేదంటే.. షూటింగ్స్‌లలో అప్పుడప్పుడు కనిపిస్తూంటారు. ఒకరి ఇంట్లోకి వెళ్లి.. మరో సెలబ్రీటీని కలవడం చాలా అరుదు. అందులోనూ.. ప్రభాస్ లాంటి హీరోలు.. బయటకు రావడం చాలా రేర్. అలాంటిది.. ప్రభాస్.. మంచు విష్ణు ఇంటికి వెళ్లడం కాస్త ఆశ్చర్యం కల్గిస్తోంది. కాగా.. దివాళి పండుగ సందర్భంగా.. మంచు వారింటికి.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:10 am, Mon, 28 October 19
మంచువారి ఇంట్లో.. ప్రభాస్ ఏం చేస్తున్నాడు..?

మంచు విష్ణు ఇంట్లో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. అయితే.. సాధారణంగా.. వారు ఏ పార్టీల్లోనో.. లేక టాలీవుడ్ ఏర్పాటు చేసిన.. షోలలో కానీ.. లేదంటే.. షూటింగ్స్‌లలో అప్పుడప్పుడు కనిపిస్తూంటారు. ఒకరి ఇంట్లోకి వెళ్లి.. మరో సెలబ్రీటీని కలవడం చాలా అరుదు. అందులోనూ.. ప్రభాస్ లాంటి హీరోలు.. బయటకు రావడం చాలా రేర్. అలాంటిది.. ప్రభాస్.. మంచు విష్ణు ఇంటికి వెళ్లడం కాస్త ఆశ్చర్యం కల్గిస్తోంది.

కాగా.. దివాళి పండుగ సందర్భంగా.. మంచు వారింటికి.. ప్రభాస్ వెళ్లాడు. మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలబ్రేషన్స్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. అక్కడికి వెళ్లిన ప్రభాస్.. వారితో సరదాగా గడినట్టు ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది. విష్ణు, విరోనికా దంపతులతో ప్రభాస్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో.. రెగ్యులర్‌గా జరుగుతోంది.