AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: “ఈసారి సినిమా ముందే వచ్చాను.. పక్కాగా హిట్టు కొడతాను” : నితిన్

యంగ్ హీరో నితిన్ కు ప్రస్తుతం సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నారు. ఇటీవల నితిన్ నటించిన సినిమాల్లో భీష్మ సినిమా తప్ప మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

Nithiin: ఈసారి సినిమా ముందే వచ్చాను.. పక్కాగా హిట్టు కొడతాను : నితిన్
Nithin
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2022 | 12:19 PM

Share

యంగ్ హీరో నితిన్(Nithiin)కు ప్రస్తుతం సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నారు. ఇటీవల నితిన్ నటించిన సినిమాల్లో భీష్మ సినిమా తప్ప మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. దాంతో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా హిట్ అనుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, మాచర్ల యాక్షన్ థీమ్ కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పెయిన్ అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. నితిన్ ఈ సినిమా చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో కావల్సినంత యాక్షన్ తోపాటు లవ్ అండ్ కామెడీ మిక్స్ చేశారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ..

సై హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడు ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత అఆ హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే  ‘మాచర్ల నియోజకవర్గం’  హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. అన్నారు.  ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ , ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలి. ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ఎలా వుందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఆగస్ట్ 12 సినిమా వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాలో పాటలని హిట్ చేశారు. అలాగే సినిమాని కూడా చూసి పెద్ద హిట్ చేయండి. బాలయ్య బాబు గారి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నప్పటికీ నా కోసం దర్శకుడు అనీల్ రావిపూడి ఈ ఈవెంట్ కు వచ్చారు అన్నారు. అలాగే కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తో పని చేయడం ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు సాగర్ మంచి పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆగస్ట్ 12 థియేటర్ లో డైరెక్ట్ యాక్షనే” అని అన్నారు నితిన్. మరి నితిన్ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..