బ్రేకింగ్ : హీరో నితిన్ పెళ్లి ఫిక్స్..వధువు ఎవరంటే..?

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ నితిన్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు.  టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవర్సరాలు గడుస్తోన్నా, ఈ యంగ్ హీరో పెళ్లి టాపిక్ వస్తే ఆమడ దూరం పారిపోతున్నాడు. గతంలో ఎన్నో సార్లు నితిన్ మ్యారేజ్‌పై గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశాడు. అయితే తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఏప్రిల్ 16న ఇతగాడి బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు తెలుస్తోంది.  లండన్‌లో ఎంబీఏ చదివిన షాలిని […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:02 pm, Mon, 13 January 20
బ్రేకింగ్ : హీరో నితిన్ పెళ్లి ఫిక్స్..వధువు ఎవరంటే..?

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ నితిన్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు.  టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవర్సరాలు గడుస్తోన్నా, ఈ యంగ్ హీరో పెళ్లి టాపిక్ వస్తే ఆమడ దూరం పారిపోతున్నాడు. గతంలో ఎన్నో సార్లు నితిన్ మ్యారేజ్‌పై గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశాడు. అయితే తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఏప్రిల్ 16న ఇతగాడి బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు తెలుస్తోంది.  లండన్‌లో ఎంబీఏ చదివిన షాలిని అనే అమ్మాయితో నితిన్ ఏడు అడుగులు వేయబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా సమాచారం. నాలుగేళ్ల వీరు ఇరువురూ ప్రేమలో ఉన్నట్లు ఉప్పందుతోంది. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్  14, 15న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరగనున్నాయట. 500 మందికి దుబాయ్‌లో బస కల్పించేలా నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి.