Nani : గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను మలయాళంలో చేస్తా.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూసే సినిమాలు నాని సినిమాలు. నాని సినిమా వస్తుందంటే అందరి ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టాల్సిందే. ఇక ఇప్పుడు ఈ నేచురల్ స్టార్ సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Nani : గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను మలయాళంలో చేస్తా.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 23, 2024 | 3:27 PM

నేచురల్ స్టార్ నాని ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. రొటీన్ కథలు కాకుండా డిఫెరెంట్ స్టోరీస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాని. నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూసే సినిమాలు నాని సినిమాలు. నాని సినిమా వస్తుందంటే అందరి ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టాల్సిందే. ఇక ఇప్పుడు ఈ నేచురల్ స్టార్ సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. అలాగే నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది.

ఇది కూడా చదవండి : ఇదేం అరాచకం రా సామీ..! బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సరిపోదా శనివారం సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా కేరళ వెళ్లిన నాని అక్కడ మీడియాతో మాట్లాడారు.  ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. సరిపోదా శనివారం సినిమా గురించిన విషయాలను పంచుకున్నాడు.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళంలో వెబ్ సిరీస్ లు తీయడం చాలా సులభం అని నాని అన్నారు. అలాగే మలయాళంలో ఏ నిర్మాత అయినా ప్రతిభ గల నటులను ఒక చోట చేర్చగలరు అని నాని అన్నారు. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో స్టార్ యాక్టర్స్‌ను ఒక చోట చేర్చడం చాలా కష్టం అని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తాను మలయాళంలో ఎప్పుడైనా ఏదైనా నిర్మించే అవకాశం వస్తే.. తాను మొదట చేసేది హాలీవుడ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని నాని చెప్పుకొచ్చారు. అలాగే తనకు మలయాళ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆవేశం, భీష్మ పర్వం, ప్రేమలు, ఆడుజీవితం సినిమాల్లో యాక్టర్స్ అద్భుతంగా నటించారు అని తెలిపారు నాని. ఇక నాని సరిపోదా శనివారం ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.