AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sultan Trailer: రౌడీలయితే భయపడాలా ? అంటున్న రష్మిక.. ఆకట్టుకుంటున్న కార్తి ‘సుల్తాన్’ ట్రైలర్..

Karthi Sultan Movie Trailer: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

Sultan Trailer: రౌడీలయితే భయపడాలా ? అంటున్న రష్మిక.. ఆకట్టుకుంటున్న కార్తి 'సుల్తాన్' ట్రైలర్..
Karthi Sultan
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2021 | 7:14 PM

Share

Karthi Sultan Movie Trailer: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో కార్తీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‍టైనర్‏గా ఈ మూవీ తెరకెక్కిన్నట్లుగా తెలుస్తోంది. రౌడీలయితే భయపడాలా ? అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుంటుంది. ఈ సినిమాలో రష్మిక లంగావోణిలో అచ్చం పల్లెటూరీ అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక ఇందులో రష్మిక డైలాగ్స్ చూస్తుంటే.. ఎవరికి భయపడని రెబల్ అమ్మాయిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే కార్తి తన కొడుకు ఫోటోను మొదటి సారిగా సోషల్ మీడియోల షేర్ చేసిన సంగతి తెలిసిందే.  ఈమేరకు తన ఇన్ స్టాలో “నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి”.. అంటూ కార్తి రాసుకోచ్చాడు.

సుల్తాన్ ట్రైలర్..

Also Read:

అయ్యయ్యో.. అష్టాచెమ్మ హీరో ఇలా ఉన్నాడేంటీ.. అవసరాల శ్రీనివాస్ అసలు రూపం బయటపెట్టిన కోడైరెక్టర్..