అయ్యయ్యో.. అష్టాచెమ్మ హీరో ఇలా ఉన్నాడేంటీ.. అవసరాల శ్రీనివాస్ అసలు రూపం బయటపెట్టిన కోడైరెక్టర్..

అష్టాచెమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవసరాల శ్రీనివాస్.. కేవలం నటుడిగానే కాకుండా.. రచయితగా తన మల్టీ టాలెంట్‏తో ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశాడు అవసరాల. ప్రస్తుతం

అయ్యయ్యో.. అష్టాచెమ్మ హీరో ఇలా ఉన్నాడేంటీ.. అవసరాల శ్రీనివాస్ అసలు రూపం బయటపెట్టిన కోడైరెక్టర్..
Avasarala Srinivas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2021 | 6:44 PM

అష్టాచెమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవసరాల శ్రీనివాస్.. కేవలం నటుడిగానే కాకుండా.. రచయితగా తన మల్టీ టాలెంట్‏తో ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశాడు అవసరాల. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అవసరాల శ్రీనివాస్ షాకింగ్ లుక్‏లో కనిపించడంతో.. అభిమానులు షాక్‏కు గురయ్యారు. ఈ వీడియోను తన కోడైరెక్టర్ మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

గత మూడేళ్ళుగా అవసరాల శ్రీనివాస్ దగ్గర కోడైరెక్టర్‏గా పనిచేస్తున్న మహేశ్‏కు, శ్రీనివాస్‏కు మధ్య గొడవలు రావడంతో.. అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి బయటకు గెంటేశాడు శ్రీనివాస్. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న మహేశ్.. అవసరాల శ్రీనివాస్ ఆఫీస్‏కు వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. ఈరోజు ఎలాగైనా నీ నిజ స్వరూపం బయటపెడతానంటూ.. అతని ఒరిజినల్ ఫేస్ చూపించి అందరికి షాకిచ్చాడు మహేశ్. ఎప్పుడు నిండైన జుట్టుతో.. అందంగా కనిపించే అవసరాల శ్రీనివాస్‏కు బట్టతల ఉందనే విషయాన్ని బయటపెట్టేశాడు మహేశ్. వెంటనే శ్రీనివాస్ రియాక్ట్ అవుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ మహేశ్‏కు వార్నింగ్ ఇస్తూ కనిపించాడు ..

మహేశ్ ఈ వీడియోను విడుదల చేస్తూ ఇలా అన్నాడు.. “మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్ళుగా పనిచేస్తున్నాను.. కానీ నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. నన్ను ఈరోజు అందరి ముందు తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. నన్ను తిట్టడానికి ఒక్క కారణం కూడా అతని దగ్గర లేదు. ఈరోజు అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి”.. అంటూ అవసరాల శ్రీనివాస్ ఫోటో‏షూట్ చేస్తుండగా.. అతని దగ్గరకు వెళ్ళి.. నేను ఏం తప్పు చేశా.. అంటూ నిలదీశాడు మహేశ్. వెంటనే శ్రీనివాస్.. ఏయ్ నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి.. అంటూ సీరియస్ అయ్యాడు అవసరాల. నువ్వు నన్ను ఎందుకు తిట్టావు అంటూ ప్రశ్నిస్తునే ఒక్కసారిగా అవసరాల శ్రీనివాస్ తలపై ఉన్న క్యాప్‏ని తీసేసాడు. ఇంకేముంది.. క్యాప్ తీయగానే.. అవసరాల బట్టతలతో కనిపించేసారు. దీంతో ఈ వీడియోను బయటకు తీసుకెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్. బయటకు తీసుకెళ్ళను… యూట్యూబ్‏లో పోస్ట్ చేస్తాను అని మహేష్ అంటుండగా.. అతని ఆపండయ్యా అని శ్రీనివాస్ అరుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీనివాస్ తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలా డిఫరెంట్‏గా ట్రైచేసి ఉంటాడు అని అభిప్రాయపడుతున్నారు.

అవసరాల శ్రీనివాస్ వీడియో..

Also Read:

Rang De Grand Release Event Live: ఘనంగా ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్.. టీవీ9లో లైవ్…

కీర్తి సురేశ్ ముఖంపై కొట్టిన నితిన్.. అంత కోపం ఎందుకు వచ్చిందో.. నెట్టింట్లో వీడియో వైరల్..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..