కీర్తి సురేశ్ ముఖంపై కొట్టిన నితిన్.. అంత కోపం ఎందుకు వచ్చిందో.. నెట్టింట్లో వీడియో వైరల్..

Nithiin Rang De Movie Update: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది.

కీర్తి సురేశ్ ముఖంపై కొట్టిన నితిన్.. అంత కోపం ఎందుకు వచ్చిందో.. నెట్టింట్లో వీడియో వైరల్..
Nithin Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 6:26 PM

Nithiin Rang De Movie Update:  నితిన్.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్‏లో నితిన్, కీర్తి సురేష్ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూ కనిపించారు. అయితే వీరిద్దరు కేవలం సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ అలాగే అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నారు. షూటింగ్ స్పాట్‏లో వీళ్లు చేసే అల్లరి మాములుగా లేదు. సినిమా మొదటి నుంచి వీరి అల్లరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో కీర్తి.. షూటింగ్ గ్యాప్‏లో చిన్న కునుకు తీస్తుండగా.. దానిని ఫోటో తీసి నెట్టింట్లో షేర్ చేశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నితిన్. దీంతో వారిద్దరి పని తర్వాత చేప్తాను అంటూ కీర్తి ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్లుగానే.. డైరెక్టర్ వెంకీని పరిగెత్తించి మరీ కొట్టింది కీర్తి. అది కూడా సీరియస్‏గా కాదండోయ్.. సరదాగానే అలా చేసింది. ఆ తర్వాత నితిన్‏కు సంబంధించిన ఓ ఫోటోను కాస్తా ఎడిట్ చేసి షేర్ చేసింది. దీనికి బదులుగా నితిన్ కూడా ఇటీవల కీర్తి స్కూల్  టైంలోని ఫోటోను చేతిలో పట్టుకొని..కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నితిన్ పోస్ట్ పై హైదరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. “మీరేం కంగారు పడకండి. మేము చూసుకుంటాం..” అంటూ బదులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వీరిద్దరి అల్లరికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో నితిన్.. కీర్తి.. పక్కపక్కనే కూర్చోని టీవీ చూస్తున్నారు. అదే సమయంలో కీర్తిపై కోపంతో ఉన్న నితిన్.. తన చేతులకు బాక్సర్ గ్లౌజ్‏లు వేసుకొని.. కీర్తి ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో తను కింద పడిపోయింది. వెంటనే నితిన్ ఆమె చేతిలో ఉన్న రిమోట్ లాక్కున్నాడు. ఈ వీడియోను కీర్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. “ఫేక్ పంచ్.. నిజంగా మారితే ఇలా మారితే ఇలా ఉంటుంది” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై నితిన్ స్పందిస్తూ.. నిజంగా కావాలని కొట్టలేదు అను అంటూ కొంటెగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక రంగ్ దే సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు.

కీర్తి సురేష్ ట్వీట్..

Also Read:

కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..

Upasana Konidela: త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన రామ్ చరణ్ సతీమణి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?