కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..

Rang De Movie Update: నితిన్.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో

కీర్తి వల్ల మా బతుకే బస్టాండ్ అంటున్న నితిన్ టీం.. బాధలు చెప్పుకుంటున్న దేవి శ్రీ.. ఇంతకీ ఏం చేసిందంటే..
Nithiin Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2021 | 2:46 PM

Rang De Movie Update: నితిన్.. కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది. ఈ సినిమా ట్రైలర్‏తోపాటు.. సాంగ్స్‏కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదే సమయంలో సినిమా ప్రమోషన్స్‏లో డిఫరెంట్ వీడియోలతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్రయూనిట్. ఇక రంగ్ దే టీంకు సంబంధించిన చిలిపి అల్లరి వీడియోలో సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కీర్తి.. షూటింగ్ గ్యాప్‏లో చిన్న కునుకు తీస్తుండగా.. దానిని ఫోటో తీసి నెట్టింట్లో షేర్ చేశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నితిన్. దీంతో వారిద్దరి పని తర్వాత చేప్తాను అంటూ కీర్తి ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్లుగానే.. డైరెక్టర్ వెంకీని పరిగెత్తించి మరీ కొట్టింది కీర్తి. అది కూడా సీరియస్‏గా కాదండోయ్.. సరదాగానే అలా చేసింది. ఆ తర్వాత నితిన్‏కు సంబంధించిన ఓ ఫోటోను కాస్తా ఎడిట్ చేసి షేర్ చేసింది. దీనికి బదులుగా నితిన్ కూడా ఇటీవల కీర్తి స్కూల్ టైంలోని ఫోటోను చేతిలో పట్టుకొని..కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నితిన్ పోస్ట్ పై హైదరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. “మీరేం కంగారు పడకండి. మేము చూసుకుంటాం..” అంటూ బదులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల నితిన్ కీర్తి సురేష్ టీవీ చుస్తూ ఉండగా.. నితిన్ కీర్తి ముఖంపై కొట్టి రీమోట్ లాక్కున్న సంగతి తెలిసిందే. అందులో ఫుల్ కోపంతో నితిన్ ఊగిపోతూ.. కీర్తిని కోట్టడం.. వెంటనే తాను కిందపడిపోవడం కాస్తా ఫన్నీగా అనిపించాయి. తాజాగా సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతుంది. కానీ ఈసారి ఈ వీడియోను సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ పోస్ట్ చేశాడు. ఇందులో కీర్తి వల్ల తాము ఎదుర్కోంటున్న బాధలను చెప్పుకున్నారు నితిన్ టీం. మరీ ఆ బాధలెంటో మనమూ తెలుసుకుందామా..

ఇటీవల సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా… రాజమండ్రిలో నిర్వహించిన రంగ్ దే ఈవెంట్‏కు హాజరయ్యారు చిత్రయూనిట్. అక్కడ వారి కోసం రకారకాల ఫుడ్ ఐటమ్స్‏ను డిన్నర్‏గా అందించింది అక్కడి సిబ్బంది. అయితే వీరు వీడియో చేస్తున్న సమయంలో కీర్తి మాత్రమే కూర్చోని ఫుల్‏గా ఆరంగించేసింది. అది చూసిన నితిన్, దేవి శ్రీ ప్రసాద్ నోరెళ్లబెట్టారు. కీర్తిని చూసి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడారు. అనంతరం బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే అంటూ తమ బాధలు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి ఈ సినిమాలోనే కాకుండా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్..

Also Read:

Upasana Konidela: త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన రామ్ చరణ్ సతీమణి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..