స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి అసిస్టెంట్‌ను సర్‌ప్రైజ్ చేసిన గోపీచంద్.. మ్యాచోస్టార్ సింప్లిసిటీపై ప్రశంసలు
సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో స్టైలిష్‌గా కనిపించే గోపిచంద్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింప్లిసిటీతో ఉంటారు. అందుకే సినిమా ఈవెంట్లు తప్పితే బయట పెద్దగా కనిపించరు. అలాంటి గోపిచంద్ తన సింప్లిసిటీ, సహృదయంతో తన అసిస్టెంట్‌ను ఆశ్చర్యపరిచారు.

దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మ్యాచో స్టార్ గోపిచంద్. మొదట విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన అతను ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. హిట్టులు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో స్టైలిష్‌గా కనిపించే గోపిచంద్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింప్లిసిటీతో ఉంటారు. అందుకే సినిమా ఈవెంట్లు తప్పితే బయట పెద్దగా కనిపించరు. అలాంటి గోపిచంద్ తన సింప్లిసిటీ, సహృదయంతో తన అసిస్టెంట్‌ను ఆశ్చర్యపరిచారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గోపిచంద్ దగ్గర శ్రీను అనే వ్యక్తి కొన్నాళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే శ్రీను ఇంటిని కట్టుకున్నారు. తాజాగా గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ శుభకార్యానికి గోపిచంద్ స్వయంగా హాజరై శ్రీను కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు. పంక్షన్‌లో కాసేపు సందడి చేశారు. అనంతరం పూజలోనూ పాల్గొన్నారు.
గోపిచంద్ సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో శ్రీను కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోపీచంద్ స్టార్ స్టేటస్‌ను పక్కన పెట్టి సింప్లిసిటీని చాటుకున్నారంటూ, మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది పక్కా కమర్షియల్ అనే సినిమాలో కనిపించాడు గోపిచంద్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం అతను తన లక్కీ డైరెక్టర్ శ్రీవాస్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‌గా కనిపించనుంది. గతంలో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్‌లో లక్ష్యం, లౌక్యం అనే సూపర్ హిట్ సనిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.





Gopichand
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..