Hero Dhanush : ఆ ఇద్దరు హీరోలు అందుకొని రికార్డ్ ను అవలీలగా అనుకున్న ధనుష్.. ఇంతకు అదేంటంటే..

Hero Dhanush  : ఆ ఇద్దరు హీరోలు అందుకొని రికార్డ్ ను అవలీలగా అనుకున్న ధనుష్.. ఇంతకు అదేంటంటే..
Dhanush

కోవిడ్ మహమ్మారి నెమ్మదించింది. హమ్మయ్య అంటూ థియేటర్ బిజినెస్ ఊపందుకునే లోగా... మళ్లీమళ్లీ డిజిటల్ రిలీజులు సౌండ్ ఇస్తూనే వున్నాయి.

Rajeev Rayala

|

Mar 04, 2022 | 9:29 PM

Hero Dhanush: కోవిడ్ మహమ్మారి నెమ్మదించింది. హమ్మయ్య అంటూ థియేటర్ బిజినెస్ ఊపందుకునే లోగా… మళ్లీమళ్లీ డిజిటల్ రిలీజులు సౌండ్ ఇస్తూనే వున్నాయి. లేటెస్ట్‌గా ఓటీటీ డయాస్‌పై హ్యాట్రిక్ కొట్టి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఓ కోలీవుడ్ హీరో. ఇద్దరు హీరోలు మిస్సయిన ఈ ఫీట్‌ని అతడైతే అవలీలగా ముగించేస్తున్నారు. ఆ తమిళ్ స్టార్ ఎవరంటే.. ఫస్ట్ వేవ్ టైమ్‌లో సిల్వర్ జూబ్లీ సినిమాను డిజిటల్ స్క్రీన్స్‌కి అంకితమిచ్చుకున్నారు నానీ. సెకండ్‌ వేవ్‌లో మనసు నొచ్చుకుంటూనే టక్‌ జగదీశ్‌ని కూడా ఓటీటీకిచ్చేశారు. శ్యామ్‌సింగరాయ్ బిగ్‌స్క్రీన్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చెయ్యడంతో ఓటీటీలో లక్కీలీ హ్యాట్రిక్ షాట్ మిస్సయ్యారు నేచురల్ స్టార్. బట్‌… కోలీవుడ్‌లో మాత్రం ఈ రేరెస్ట్ ఫీట్ గురించి స్టార్ హీరోల మధ్య పెద్ద పోటీయే వుంది. దేనికీ తలొగ్గను అనే అగ్రెసివ్ మేనరిజంతో సూర్య చేస్తున్న పక్కా కమర్షియల్ మూవీ ఈటీ. లేటెస్ట్‌గా రిలీజైన ట్రయిలర్… సూర్యలోని సింగం మార్క్‌ మాస్ యాక్షన్ ఎలిమెంట్‌ని రీఇంట్రడ్యూస్ చేస్తోంది. గతంలో ఆకాశం నీ హద్జురా, జై భీమ్ ఓటీటీలో రిలీజై సూపర్‌సక్సెస్ కావడంతో.. ఈ థర్డ్ మూవీ మీద కూడా డిజిటల్ సెంటిమెంటే ప్రయోగిస్తారని ఫ్యాన్స్‌లో కూడా టాక్ నడిచింది. బట్‌… ఈనెల 10న వస్తున్నాం అంటూ థియేటర్ ఆడియన్స్‌కి ప్రామిస్ చేసింది సన్‌ పిక్చర్స్ సంస్థ.

కోలీవుడ్‌లో మరో యంగ్ టర్క్ ధనుష్ మాత్రం.. డిజిటల్ ఆడియన్స్‌తో నాన్‌స్టాప్‌గా టచ్‌లోనే వున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ జగమే తంత్రమ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై.. కొలవెరి కుర్రాడికి పాన్‌ వరల్డ్‌ హీరోగా గ్రాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చింది. అటు తర్వాత అదే ఏడాదిలో అక్షయ్‌తో కలిసి నటించిన బీటౌన్ వెంచర్ ఆత్రాంగీరే కూడా హాట్‌స్టార్‌ ఆడియన్స్‌ మనసును దోచుకుంది. కట్‌ చేస్తే.. ధనుష్ లైనప్‌లో థర్డ్‌ మూవీ మారన్ కూడా ఓటీటీ స్క్రీన్స్‌కే జైకొట్టి… ఫ్యాన్స్‌కి షాకిస్తోంది. ఈనెల 11న హాట్‌స్టార్‌కే అంకితమౌతోంది మారన్. కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు ధనుష్. సో. నానీ, సూర్య మిస్సయిన ఆ హ్యాట్రిక్ మూమెంట్‌ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు ధనుష్. పన్లో పనిగా తెలుగు ఆడియన్స్‌క్కూడా దగ్గరౌతున్నారు. ఇలా డిజిటల్ స్టార్‌గా కంటిన్యూ అయితే… తన థియేటర్ మార్కెట్ పలచబడుతుందన్న బెంగ మాత్రం ధనుష్‌ దగ్గర ఇసుమంతైనా కనిపించడం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu