Naga Chaitanya: కొత్త అవతారం ఎత్తిన నాగచైతన్య.. కెరీర్‌లో విషయంలో మరో కీలక అడుగు..
Naga Chaitanya: అక్కినేని నట వారసత్వం అనే ట్యాగ్‌లైన్ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదిచుకున్నారు నాగ చైతన్య. కేవలం హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు...
Naga Chaitanya: అక్కినేని నట వారసత్వం అనే ట్యాగ్‌లైన్ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదిచుకున్నారు నాగ చైతన్య. కేవలం హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సమంతతో (Samantha) విడాకుల వ్యవహారం తర్వాత కెరీర్‌పై మరింత ఫోకస్ పెంచిన చైతన్య.. వరుస సినిమాలతో బిజీగా మారారు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ప్లానింగ్ వేసుకున్నారు చై. ఈ క్రమంలోనే కెరీర్ విషయంలో చైతన్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి నాగార్జునలాగే (Nagarjuna) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకు చాలా రకాల వ్యాపారాలు చేసినా ఫుడ్ బిజినెస్‌లోకి మాత్రం ఎంటర్ కాలేదు. కానీ చైతూ మాత్రం ఇదే రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
‘షోయూ’ పేరుతో పాన్ ఏషియన్ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించారు. చైతన్య ఈ వ్యాపారంలోకి తన స్నేహితుడు వరుణ్ త్రిపురనేనితో కలిసి అడుగుపెట్టారు. క్లౌడ్ కిచెన్ విధానంలో పనిచేయనున్న ‘షోయూ’ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్‌కి సరికొత్త ఆహారాన్ని పరిచయం చేయనుంది. ఆసియా వ్యాప్తంగా లభించే విభిన్న రకాల ఆహార పదార్థాలను అందించనున్నారు.
Good food is something I’ve always been passionate about and asian has always been one of my favorites Presenting shoyu .. a premium delivery only brand that brings some of the finest pan Asian dishes to you ! Order now ! Exclusively on @swiggy_in pic.twitter.com/EYwqOhnj8P
— chaitanya akkineni (@chay_akkineni) March 3, 2022
ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. తన సొంత బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ రూపొందించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చైతన్య.. ‘షోయూ’ ప్రారంభానికి ముందు తాను చేసిన వర్కవుట్‌కు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. మరి సినిమాలో తన మార్కు సంపాదించుకున్న చైతన్య, వ్యాపార రంగంలో ఏమేర రాణిస్తారో చూడాలి.
Also Read: Shane Warne Death: సచిన్ టెండూల్కర్‌ను చూస్తే భయమేసేది.. నా కలలో కూడా సిక్సర్లు కొట్టేవాడుః వార్న్
Meenakshi Chaudhary: గ్లామరస్ ఫొటోస్‌తో యూత్‌ను తనవైపు తిప్పుకుంటున్న బ్యూటీ మీనాక్షి చౌదరి…(ఫొటోస్)
అన్నీ పంచుకోవాలనుకున్న అక్కాచెల్లెల్లు.. ఒక్కడిని చేసి ట్విస్ట్ ఇచ్చారు.. మరి అతనేం చేశాడో తెలుసా..