అన్నీ పంచుకోవాలనుకున్న అక్కాచెల్లెల్లు.. ఒక్కడిని చేసి ట్విస్ట్ ఇచ్చారు.. మరి అతనేం చేశాడో తెలుసా..

అన్నీ పంచుకోవాలనుకున్న అక్కాచెల్లెల్లు.. ఒక్కడిని చేసి ట్విస్ట్ ఇచ్చారు.. మరి అతనేం చేశాడో తెలుసా..
Marriage

Love Story: వివాహానికి సంబంధించిన రోజూ అనేక వార్తలను మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో జరిగే వింత ఘటనకు సంబంధించిన వీడియోలు

Shiva Prajapati

|

Mar 04, 2022 | 7:16 PM

Love Story: వివాహానికి సంబంధించిన రోజూ అనేక వార్తలను మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో జరిగే వింత ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా వివాహానికి సంబంధించి వింత వార్త వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకే వ్యక్తి ప్రేమించి.. ఆ వ్యక్తినే వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే చేసుకుంటే ముగ్గురిని చేసుకో.. లేదంటే ఊకో అనే కండీషన్ పెట్టడంతో ఆ వరుడు సైతం ఏమీ చేయలేక ముగ్గురినీ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లువిజో(32) వ్యక్తికి సోషల్ మీడియాలో నటాలీ అనే యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ తరువాత నటాలీ చెల్లెల్లు కూడా లువిజోను పరిచయం చేసుకున్నారు. కాలక్రమంలో వారు కూడా లువిజోను ప్రేమించడం మొదలు పెట్టారు. అయితే లువిజో.. నటాలీని పెళ్లుచేసుకోవాలని ఫిక్స్ అవగా.. మిగతా ఇద్దరు చెల్లెల్ల ప్రేమ వ్యవహారం కూడా బయటపడింది. దాంతో ముగ్గురు అక్కాచెల్లెల్లు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ముగ్గురు కలిసి అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంకేముంది.. తమ నిర్ణయాన్ని లువిజోకి తెలిపారు. తమ ముగ్గురినీ పెళ్లి చేసుకోవాలని లువిజోకి కండీషన్ పెట్టారు. లేదంటే ఎవరి దారి వారిదేనని అన్నారు. దాంతో.. షాక్ అయిన లువిజో కాస్త ఆలోచించాడు. చివరకు ముగ్గురినీ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.

దీనిపై నటాలీ మాట్లాడుతూ.. ‘‘మేం ముగ్గురం కలిసి పెళ్లి కండిషన్‌ను లువిజో ముందు పెట్టడంతో ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత మా కండీషన్‌ను లువిజో అంగీకరించాల్సి వచ్చింది. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం లువిజోను గాఢంగా ప్రేమించాం. ముగ్గురు స్త్రీలకు ఒకే భర్త ఉండటం అసాధ్యం అని ప్రజలు భావించినప్పటికీ.. మేం ముగ్గురం చిన్నప్పటి నుంచి ప్రతీది షేర్ చేసుకున్నాం. ఇప్పుడు భర్తను కూడా షేర్ చేసుకుంటున్నాం. లువిజోను మేం ముగ్గురం పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.’’ అని చెప్పుకొచ్చింది.

Also read:

Andhra Pradesh: ఇద్దరు ఫ్రెండ్స్ మిస్సింగ్.. రెండేళ్లుగా వీడని చిక్కుముడి.. ఒక్క పోస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

Russia-Ukraine War: రణరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్న విద్యార్థులు.. వారు పడ్డ కష్టాలను తలచుకుంటూ..

Bank Offers : పొదుపు చెయ్యాలనుకుంటున్నారా..? ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu