Vantalakka: అయ్య బాబోయ్.. ఈ అమ్మడు వంటలక్క కూతురా.. ? ఎంత అందంగా ఉందో చూశారా.. ?
ప్రేమి విశ్వనాథ్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది. ఈ సీరియల్లో వంటలక్క అలియాస్ దీప పాత్రలో అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి అలరిస్తుంది.

బుల్లితెరపై దాదాపు 7ఏళ్లు సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. టీఆర్పీ రేటింగ్‌లోనూ మరే సీరియల్ అందుకోలేని వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సీరియల్ తెలుగు అడియన్స్ ఫేవరేట్. ఈ సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఈ సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఉండేది. సినిమాల్లోని హీరోహీరోయిన్లకు మించి క్రేజ్ సంపాదించుకుంది వంటలక్క. సహజ నటనతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు కార్తీక్ , దీప. సోమవారం నుంచి శనివారం వరకు స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.
ప్రేమి విశ్వనాథ్.. కేరల రాష్ట్రానికి చెందిన నటి. మలయాళంలో పలు సీరియల్స్ చేసింది. కానీ తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వంటలక్క పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కేవలం దీప పాత్రతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలియకపోవచ్చు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది ప్రేమి విశ్వనాథ్. ఇటీవలే ఆమె కొడుకుతో చేసిన రీల్స్ తెగ వైరలయ్యాయి. తాజాగా ప్రేమి విశ్వనాథ్ కూతురు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ అమ్మడు దీప సొంత కూతురు కాదండోయ్. రీల్ కూతురు మాత్రమే.
కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురిగా నటించిన శౌర్య గుర్తుందా.. ? అద్భుతమైన నటనతో అడియన్స్ చేత శభాష్ అనిపించినా చైల్డ్ ఆర్టిస్టే బేబీ కృతిక. పలు సీరియల్స్ చేసిన కృతిక.. కార్తీక దీపం సీరియల్ ద్వారానే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. చదువుల దృష్ట్యా సీరియల్స్ కు దూరంగా ఉంటున్న కృతిక.. తాజాగా నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కృతిక ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పుడు క్యూట్ గా ఉన్న కృతిక.. ఇప్పుడు ఎంతో అందంగా తయారయ్యింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :