Tollywood : మందుబాబులకు పండగలాంటి వార్త.. ఇకపై థియేటర్లలో పూటుగా తాగేసి సినిమా చూడొచ్చు..
థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే థ్రిల్ వేరప్పా. మాస్ యాక్షన్, రొమాంటిక్, పీరియాడిక్ మూవీస్ ఇలా ఏ జానర్ చిత్రాలైనా బిగ్ స్ర్కీన్ పై చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల కోసం మల్టీప్లెక్స్ పీవీఆర్ ఐనాక్స్ సరికొత్త ఆలోచన చేస్తోంది.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చినప్పటి నుంచి థియేటర్లకు జనాల తాకడి తగ్గిపోయింది. స్టార్ హీరోస్ సినిమాలైనా.. భారీ బడ్జెట్ చిత్రాలైనా థియేటర్లలో చూసేందుకు జనాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో థియేటర్లలో జనాలను రప్పించేందుకు సరికొత్త ఆలోచన చేస్తుంది పీవీఆర్ ఐనాక్స్. థియేటర్లలో పాప్ కార్న్, ఫ్రాంకీస్, కూల్ డ్రింగ్స్ ఎవరైనా అమ్ముతారు.. కానీ ఆల్కహాల్ అమ్మితే ఎలా ఉంటుందని? యోచిస్తుంది పీవీఆర్. అందుకే సినిమా చూసేందుకు వచ్చే మందుబాబులకు థియేటర్లలో మద్యం అందుబాటులో ఉంచాలని భావిస్తుంది. ఇందుకోసం సెపరేట్ లైసెన్స్ కోరుతున్నట్లు సమాచారం. థియేటర్లలో తగ్గిపోతున్న జనసందోహాన్ని పెంచేందుకు నిర్వాహకులు నీ నిర్ణయం తీసుకున్నారు.
థియేటర్లలో జనాల తాకిడి పెంచేందుకు మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. అదే థియేటర్లో మద్యం అమ్మకాలు. అయితే ముందుగా గురుగ్రామ్, బెంగుళూరు వంటి ప్రాంతాల్లోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రీమియం ప్రాపర్టీలలో మద్యం అందించడానికి లైసెన్స్ లు కోరుతుందని ఈ ప్లాన్ గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. అయితే ఈ ప్లాన్ వల్ల ఆడిటోరియంలోకి ప్రేక్షకులను పెంచే అవకాశం లేకపోయినా డైరెక్టర్స్ కట్ వంటి లగ్జరీ థియేటర్లలో సినిమా చూసే ముందే లేదా ఆ తర్వాత వారు లాంజ్ లో డ్రింక్స్ తీసుకోవచ్చు. ఈ ఆలోచనతో సినిమా స్క్రీనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆదాయాన్ని సైతం పెంచుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం న్యూఢిల్లీలోని డైరెక్టర్స్ కట్, ముంబైలోని ఐనాక్స్ వంటి ప్రీమియం ప్రాపర్టీల లాంజ్‌లు, సీటింగ్ ప్రాంతాలు, లైవ్ మ్యూజిక్ జోన్‌లలో మద్యం అందిస్తోంది. ఈ జోన్‌లు సినిమా ఆడిటోరియంలకు ఆనుకొని ఉన్నాయి. కానీ వాటికి సినిమా హాల్లు అనుసంధానించలేదు. కానీ వాటికి అనుసంధానించబడలేదు. సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం సినిమా హాళ్ల లోపం మద్యం నిషేదించారు.
ఇవి కూడా చదవండి :