AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema: నటి హేమ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే

తెలుగు, తమిళ, కన్నడ భాషలు కలిపి సుమారు 250 కు పైగా సినిమాల్లో నటించింది హేమ. అయితే ఈ మధ్యన ఆమె ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అదే సమయంలో ఇతర విషయాలు, వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని నెలల క్రితం సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొందని ఆరోపణలు వచ్చాయి.

Hema: నటి హేమ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే
Actress Hema
Basha Shek
|

Updated on: Oct 27, 2024 | 5:31 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటీమణి హేమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. హీరో, హీరోయిన్లకు తల్లి, అత్తమ్మ, వదిన, పిన్నీ.. ఇలా సహాయక పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది హేమ. అందుకు కారణాలేవైనా ఈ మధ్యన ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. 250 పైగా సినిమాల్లో నటించిన హేమ మా ఎన్నికల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక రీసెంట్ గా బెంగళూరులోని ఓ రేవ్ పార్టీలో హేమ పాల్గొందని ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అంతేకాదు ఆమె డ్రగ్స్ తీసుకుందని అరెస్ట్ కూడా చేశారు. కొన్ని రోజుల జైలులో గడిపిన ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ వివాదం కారణంగా మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ హేమను బహిష్కరించింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించిన హేమ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. హేమ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఇతను సినిమాటోగ్రాఫర్. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లీ చేసుకున్నారు హేమ, సయ్యద్. ప్రస్తుతం ఈ దంపతులకు ఇషా అనే కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 23 సంవత్సరాలు. ప్రస్తుతం చదువులో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హేమ అప్పుడప్పుడు తన కూతురు ఫొటోలను కూడా అందులో షేర్ చేస్తుంటుంది. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హేమ కూతురు చాలా అందంగా ఉందని, హీరోయిన్ అయ్యే ఫీచర్స్ చాలా ఉన్నాయంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ఇషాను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెంచుతోంది ఇషా. అందుకే సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు కూడా తీసుకు రాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన కూతురితో కనిపిస్తుంటుంది. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కూతురు ఇషాతో నటి హేమ..

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

ఫారిన్ వేకేషన్ లో హేమ, ఇషా..

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో