Arvind Swami daughter: స్టైలిష్ యాక్టర్ అరవింద్ స్వామి కుమార్తెను ఎప్పుడైనా చూశారా…? ఈమె హీరోయిన్ ఎందుకు అవ్వలే
తండ్రి వ్యాపారాలను సైతం కూతురు అదిరా కొనసాగిస్తుంది.అరవింద్ స్వామి సినిమాలు మానేసిన తర్వాత ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది.
రోజా, బొంబాయ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? మణిరత్నం కల్ట్ క్లాసిక్స్ ఈ చిత్రాలు. ఈ మూవీస్ ద్వారా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు అరవింద్ స్వామి. అమ్మాయిల మోస్ట్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో పాన్-ఇండియన్ అప్పీల్‌ను సాధించగలిగిన భారతదేశంలోని కొద్దిమంది నటులలో అతనూ ఒకరు. కెరీర్ పీక్ దశలో ఉండగానే 2000 సంవత్సరంలో బిజినెస్‌పై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు అరవింద్ స్వామి. ఆ రంగంలో తిరుగులేని విధంగా దూసుకుపోయారు. కానీ విధి అతన్ని హ్యాపీగా ఉండనివ్వలేదు. 2005లో ప్రమాదానికి గురై వెన్నెముకకు గాయమైంది. అది పాక్షిక పక్షవాతానికి దారితీసింది. చాలా సంవత్సరాలు నొప్పితో బాధపడ్డాడు. చికిత్స కోసం మరో 4-5 సంవత్సరాలు పట్టింది. ఫైనల్‌గా కోలుకున్నాడు. నార్మల్ మనిషి అయ్యాడు. ఎక్కువ బెడ్ రెస్ట్ కారణంగా విపరీతంగా బరువు పెరిగాడు. ఇతడు అరవింద్ స్వామి అంటే నమ్మడం కూడా కష్టమనేలా పరిస్థితి మారింది.
ఐతే మణిరత్నం ‘కడలి’ చిత్రం కోసం తనను మళ్లీ పిలవడంతో మళ్లీ సినిమాల వైపు వచ్చాడు.. అప్పుడు బరువు తగ్గే ప్రయత్నం చేయడంతో మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు డైట్ ఫాలో అవ్వడంతో పాటు విపరీతమైన వర్కువుట్స్ చేశాడు. తనీ ఒరవన్, దాని తెలుగు రీమేక్ ధృవ సినిమాలో అరవింద్ స్వామిని చూస్తే.. ఇంతకంటే స్టైలిష్ విలన్ సౌత్ ఇండియాలో ఉన్నాడా అనిపించింది. ఆ తర్వాతి నుంచి నాన్ స్టాప్‌గా నటిస్తున్నాడు ఈ వెటరన్ యాక్టర్.
అరవింద్ స్వామి పర్సనల్ లైఫ్‌కి వస్తే అతడికి మొదటగా గాయత్రి రామమూర్తితో వివాహం జరిగింది. కానీ 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి ఒక కూతురు… ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు అధిర. ఆమె లండన్‌లో చదువుకున్నారు. గ్రెనేడ్ డిప్లమోలో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రజంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అందంలో కూడా ఆమె హీరోయిన్స్‌కు ఏ మాత్రం తక్కవ కాదు. కాగా 27 సంవత్సరాల అధిరకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. మంచి చెఫ్‌గా కూడా ఈమెకు పేరుంది. మీడియాకు దూరంగా ఉంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.