ఈ సినిమా నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ : హరితేజ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నెల 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందనా తొలిసారి ఈ మూవీ కోసం మహేశ్‌తో జోడి కట్టింది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ […]

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నెల 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందనా తొలిసారి ఈ మూవీ కోసం మహేశ్‌తో జోడి కట్టింది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కాగా ఈవెంట్ పాల్గొన్న నటి హరితేజ స్టేజ్‌పై తన ఫన్నీ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌తో మూడవ సినిమాలో నటించానని చెప్పిన ఈ నటి…ట్రైన్ ఎఫిసోడ్ ఆడియెన్స్‌ని హిలేరియస్‌గా ఆకట్టుకుంటుందని చెప్పారు. రష్మిక మందనా, సంగీతతో కలిసి నటించానని.. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. “‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా డెఫినెట్‌గా బ్లాక్‌బాస్టర్, మైండ్ బ్లాక్, ఇది ఫిక్స్. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్” అంటూ ఫన్నీ స్లాంగ్‌లో తన స్పీచ్‌ను ముగించారు.




