AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌కు పెద్దన్నలా మారిన చిరు..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరివాడయ్యారు. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలిన వెండితెర రారాజు..ఆ తర్వాత 9 ఏళ్ల పాటు రాజకీయాలవైపు వెళ్లి సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు. తిరిగి ఖైది నెం150 తో సిల్వర్ స్రీన్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా చిరులో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. 64 ఏళ్ల వయసులోనూ ఆయన స్టెప్పులో పవర్ మారలేదు. ఇక ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నలా మారాడు చిరంజీవి. దాసరి […]

టాలీవుడ్‌కు పెద్దన్నలా మారిన చిరు..
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 06, 2020 | 3:23 PM

Share

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరివాడయ్యారు. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలిన వెండితెర రారాజు..ఆ తర్వాత 9 ఏళ్ల పాటు రాజకీయాలవైపు వెళ్లి సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు. తిరిగి ఖైది నెం150 తో సిల్వర్ స్రీన్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా చిరులో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. 64 ఏళ్ల వయసులోనూ ఆయన స్టెప్పులో పవర్ మారలేదు. ఇక ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నలా మారాడు చిరంజీవి. దాసరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పెద్దదిక్కు కరువయ్యారు. పరిశ్రమలో చిన్న, చిన్న సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు, చిన్న సినిమాలకు ఎంకరేజ్ చేసేందుకు, తెలుగు మూవీస్‌ను ముందుకు నడిపించేందుకు ఓ వ్యక్తి కావాల్సి వచ్చింది ఇండస్ట్రీకి.

సరిగ్గా ఇదే టైంలో నేనున్నంటూ ముందుకు వచ్చారు మెగాస్టార్. రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టడంతో..ఆయన మనసు పూర్తిగా సినిమాలకు అంకితమైంది. చిన్న హీరోలు ఆడియో ఫంక్షన్స్‌కు ముఖ్య అతిధిగా వెళ్లి, ఆయా సినిమాలను ఆదరించాలని కోరుతున్నారు చిరు. అంతేకాదు ‘మా’..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఏమైనా సమస్యలు ఉంటే చక్కదిద్దుతున్నారు. ఇటీవల ‘మా’ 2020 ఈవెంట్‌లో పాల్గొన్న చిరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నతి కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్టు తెలిపారు. మరోవైపు తన, మన బేధాలు లేకుండా..కేవలం మెగా హీరోలు చిత్రాలకు మాత్రమే కాకుండా అందరి హీరోల సినిమాలు హిట్స్  చేయాలని కోరుతున్నారు. తాజాగా నిన్న(జనవరి5) జరగనున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ సరిలేదరు నీకెవ్వరు మూవీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరు. ఆ సందర్భంలో మాట్లాడుతూ దక్షిణాదిలో ఉన్న యాక్టర్స్ అందరకి సీనియర్ అయినటువంటి సూపర్‌స్టార్ కృష్ణ గారికి..సినిమావారికి ఇచ్చే అత్యన్నత పురష్కారం దాదాసాహేబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే నేడు (జనవరి 6)  మెగాస్టార్ మేనల్లుడు, స్టైలిష్ స్టార్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ మూవీ టీం కూాడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సరిలేరు, అల వైకుంఠపురంలో రెండు మూవీస్ పొంగల్ బరిలో పోటీ పడబోతోన్నాయి. అయినా కూడా చిరు..మేనల్లుడి సినిమాకు కాకుండా..మహేశ్ సినిమాకు అతిథిగా రావడం ఆయన గొప్పతనమేనంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఏది ఏమైనా టాలీవుడ్‌కు మెగాస్టార్ ప్రజంట్ పెద్దన్నలా మారడన్నది చాలామంది వాదన.