AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌లో.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న బన్నీ..

సౌత్‌ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌కు రంగం సిద్దమవుతోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్‌గూఢ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురం’ మూవీ టీం బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఇప్పటికే భారీ స్టేజ్‌తో..మిరిమిట్లు గొలిపే వెలుగుల మధ్య ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయాస్ మీడియా ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో చాలా స్పెషాలిటీస్ కనువిందు చేయబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌ కోసం సినిమాలో పాటలు పాడిన రియల్ సింగర్స్ అందరూ లైవ్ ప్రదర్శన […]

బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌లో.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న బన్నీ..
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2020 | 2:49 PM

Share

సౌత్‌ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌కు రంగం సిద్దమవుతోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్‌గూఢ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురం’ మూవీ టీం బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఇప్పటికే భారీ స్టేజ్‌తో..మిరిమిట్లు గొలిపే వెలుగుల మధ్య ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయాస్ మీడియా ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో చాలా స్పెషాలిటీస్ కనువిందు చేయబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌ కోసం సినిమాలో పాటలు పాడిన రియల్ సింగర్స్ అందరూ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.

ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైవ్ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేశాడట. బన్నీ తన ప్రదర్శనతో ఈ సాయంత్రం ఫ్యాన్స్‌‌ను ఒక ఊపు ఊపేసినట్టే అంటున్నారు ఫిల్మ్ సర్కిల్ జనాలు. మాటల మాంత్రికుడు ఈ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. అదే విధంగా బన్నీ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్‌ను కూడా జొప్పించాడట. మొత్తం మీద ఈ సినిమా మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్‌లాగా సిద్దం చేసినట్టు సమాచారం.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిగా, తమన్ సంగీతం అందించాడు. పొంగల్ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సినిమా.