AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్‌తో బన్నీ.. ‘అల వైకుంఠానికి’ పడే హిట్లు ఎన్ని.?

త్రివిక్రమ్ సెల్యులాయిడ్… ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడానికి స్క్రీన్ మీద ఈ ఒక్క పేరు చాలు. హీరోతో సంబంధం లేకుండా సినిమాను తన ఫేమ్‌తో ఆడించగలిగిన డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోకొల్లలు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో […]

త్రివిక్రమ్‌తో బన్నీ.. 'అల వైకుంఠానికి' పడే హిట్లు ఎన్ని.?
Ravi Kiran
|

Updated on: Jan 07, 2020 | 5:33 PM

Share

త్రివిక్రమ్ సెల్యులాయిడ్… ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడానికి స్క్రీన్ మీద ఈ ఒక్క పేరు చాలు. హీరోతో సంబంధం లేకుండా సినిమాను తన ఫేమ్‌తో ఆడించగలిగిన డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోకొల్లలు.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన అన్ని పాటలకూ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కు మాత్రం మిశ్రమ స్పందన రావడం గమనార్హం.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇమేజ్ కొంతకాలంగా మందకొడిగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి. 2018లో పవన్ కళ్యాణ్ హీరోగా తీసిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా  నిలవడమే కాకుండా ఇమేజ్‌ను కూడా పూర్తిగా దెబ్బతీసింది. కానీ గురూజీ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ తీసి పెద్ద హిట్ సాధించారు. అయితే ఈ మూవీకి కూడా కొన్ని అంశాలలో నెగటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇలాగే భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు గతంలో డిజాస్టర్లుగా మారాయి. వాటిల్లో మహేష్- మురుగదాస్ కాంబోలో వచ్చిన ‘స్పైడర్’ ఒకటి కాగా.. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ మరొకటి. మరి త్రివిక్రమ్ గత సినిమాల్లోని పొరపాట్లను ‘అల వైకుంఠపురంలో’ పునరావృతం కాకుండా చూసుకుంటారా లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..