AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిలేరు సినిమానే ఓ సెన్సేషన్ : రామజోగయ్య శాస్త్రి

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే య/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సొంత చేసుకొన్న ఈ చిత్రం..పొంగల్ కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో  ‘మెగా సూపర్‌’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ […]

సరిలేరు సినిమానే ఓ సెన్సేషన్ : రామజోగయ్య శాస్త్రి
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2020 | 7:43 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే య/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సొంత చేసుకొన్న ఈ చిత్రం..పొంగల్ కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో  ‘మెగా సూపర్‌’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి..సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తిగా అనిల్ రావిపూడి స్టైల్లో..కామెడీ టైమింగ్, ఎమోషన్ కలగలుపుగా రాబోతుందని పేర్కొన్నారు. దేవి శ్రీ ప్రసాద్, రత్నవేలు వంటి గొప్ప టెక్నిషియన్లు ఈ చిత్రానికి పనిచేశారని, ఆ పనితనం స్క్రీన్‌పై కనిపించబోతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రెండు పాటలు రాశానని చెప్పిన రామజోగయ్య శాస్త్రి..ఒక సాంగ్‌లోని పంక్తులను స్టేజ్‌పై పాడి వినిపించారు.