RBI: ఆర్‌బీఐ మరో బిగ్ డెసిషన్.. ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సిబిల్ స్కోర్ రిపోర్టింగ్ విషయంలో పలు మార్పులు చేసింది. రుణాలు, క్రెడిట్ కార్డుల మంజూరుకు సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమనేది మనందరికీ తెలిసిందే. మినిమం 700 సిబిల్ స్కోర్ లేకపోతే మీకు లోన్లు, క్రెడిట్ కార్డులు రావు.

క్రెడిట్ స్కోర్ ఆర్ధికపరంగా ఎంత ముఖ్యమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారనేది మీ క్రెడిట్ రిపోర్టును చూస్తే తెలిపిపోతుంది. మీ ఆర్ధిక పరిస్థితిని క్రెడిట్ రిపోర్టుతో ఎవరైనా అంచనా వేయవచ్చు. లోన్లు, క్రెడిట్ కార్డు పొందాలనుకునేవారికి సిబిల్ స్కోర్ అనేది అత్యంత ముఖ్యం. ఇప్పుడు క్రెడిట్ రిపోర్ట్‌కు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వారానికి ఒకసారి బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు క్రెడిట్ రిపోర్ట్ డేటాను సిబిల్ బ్యూర్‌కు అందించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న నిబంధనల్లో ఇప్పుడు మార్పులు చేసింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఒక నెల నుంచి వారం వరకు..
గతంలో నెలకు ఒకసారి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు నెలకు ఒకసారి మాత్రమే కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును అప్డేడ్ చేసి బ్యూరోకు పంపించాల్సి ఉండేది. కానీ ఈ ఏడాది జనవరి 1 నుంచి దానిని 15 రోజులకు మార్చారు. 15 రోజులకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్ చేసేలా ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వారానికి ఒకసారి డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాల గుర్తింపును మెరుగుపర్చడం, వినియోగదారులకు ఖచ్చితమైన సమాచారం అందుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన క్రెడిట్ ఇన్పర్మేషన్ రిపోర్టింగ్ డైరెక్షన్స్,2025 మసాయిదా సవరణలో ఈ మార్పులను ఆర్బీఐ విడుదల చేసింది.
వారం రోజుల్లోనే పెరుగుదల
గతంలో మీరు లోన్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో ముందస్తుగా చెల్లించినా లేదా క్రెడిట్ కార్డు బిల్లును ముందుగా క్లియర్ చేసినా సిబిల్ స్కోర్‌లో అప్డేట్ కావడానికి చాలా టైమ్ పట్టేది. అప్డేట్ అవ్వడానికి 30 నుంచి 40 రోజులు పట్టేది. ప్రస్తుతం అమల్లో ఉన్న 15 రోజులు పీరియడ్ వల్ల కూడా టైమ్ పడుతుంది. కానీ వారంలోనే అప్డేట్ అవ్వడం వల్ల మీ సిబిల్ అప్‌డేట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు ముందుగానే బిల్లు చెల్లిస్తే మీ సిబిల్ స్కోర్ వెంటనే అప్‌డేట్ అవుతుంది. ఇక మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లు, టాప్-అప్‌లు లేదా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తూ ఉంటాయి. మీ సిబిల్ స్కోర్ త్వరగా అప్డేట్ వల్ల మీకు లోన్లు త్వరగా మంజూరయ్యే అవకాశలు ఉంటాయి. అంతేకాకుండా తక్కువ వడ్డీకే మీకు లోన్లు లభించే అవకాశం ఉంటుంది.




