Hanuman: పవర్ ఫుల్ ‘హనుమాన్ చాలీసా’ రిలీజ్.. క్షణాల్లోనే అద్భుతం.. మీరు విన్నారా ?
హనుమాన్ సినిమా నుంచి పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా రిలీజ్ అయ్యింది. చాలీసాపై.. హనుమాన్ కు సంబంధించిన యానిమేషన్ విజువల్స్ కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది. సాయి చరణ్ భాస్కరుని ఆలపించగా.. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించగా.. అధిక సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ మహానగరంలోనూ శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. భారీ పోలీసు భద్రతా మధ్య ఈ యాత్ర జరిగింది. ఇదిలా ఉంటే.. అటు హనుమాన్ జయంతి పురస్కరించుకుని పలు సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాసేపటి క్రితం హనుమాన్ సినిమా నుంచి పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా రిలీజ్ అయ్యింది. చాలీసాపై.. హనుమాన్ కు సంబంధించిన యానిమేషన్ విజువల్స్ కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది. సాయి చరణ్ భాస్కరుని ఆలపించగా.. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఇందులో అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇతర ముఖ్యమైన పాత్రలలో వినయ్ రాయ్ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. అనుదీప్ దేవ్ – హరి గౌర సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవల్లో విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. తెలుగుతోపాటు.. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ వంటి 11 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయనున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




