Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న హీరోయిన్ హంసానందిని.. ఎలా మారిపోయిందో చూశారా ?..
అనుమానస్పదం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన హంసానందిని .. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది.
సినీ పరిశ్రమలోని కొందరు తారలు క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంటి హీరోయిన్స్ క్యాన్సర్ మహామ్మారి నుంచి కోలుకుని.. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని కూడా ఒకరు. అనుమానస్పదం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ బారిన పడింది. కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్న హంసానందిని ఇటీవలే ఈ మహామ్మారిని జయించినట్లుగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టింది ఈ హీరోయిన్. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆమె నయా లుక్స్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
ఎందుకంటే.. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో మునుపటి కంటే మరింత అందంగా గ్లామరస్ గా కనిపిస్తోంది హంసానందిని. ఆమె నయ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. రెండేళ్ల క్రితం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని పోస్ట్ చేసింది హంసానందిని. ఆమె తల్లి కూడా ఇదే సమస్యతో మరణించిందని.. దీంతో చిన్నప్పటి నుంచి అంధకారంలోనే పెరిగానని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెబుతూ.. తనకు క్యాన్సర్ విషయాన్ని చెప్పారు. అన్ని కష్టాలను ఎదుర్కొన్నట్లుగానే ఈ క్యాన్సర్ సమస్యను కూడా జయించి మళ్లీ కమ్ బ్యాక్ అవుతానని చెప్పుకొచ్చింది హంసానందిని.
ఇక చెప్పినట్టుగానే ఆత్మవిశ్యాసంతో క్యాన్సర్ ను జయించి ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది హంసానందిని. ఆమె లేటేస్ట్ ఫోటోస్ చూసి అవాక్కవుతున్న నెటిజన్స్..తనకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.