AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‏కు చిరాకు వస్తే ఏం చేస్తాడో తెలుసా ?.. బాలయ్యకు అసలు రహస్యం చెప్పిన గోపిచంద్..

ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన స్నేహితుడు మ్యాచో హీరో గోపిచంద్ తో కలిసి సందడి చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబర్ 29న స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్‏కు ఆహా యాప్ సైతం క్రాష్ కాగా..

Prabhas: ప్రభాస్‏కు చిరాకు వస్తే ఏం చేస్తాడో తెలుసా ?.. బాలయ్యకు అసలు రహస్యం చెప్పిన గోపిచంద్..
Prabhas, Gopichand
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2023 | 11:30 AM

Share

ప్రభాస్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు. డార్లింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ముందుకు నేరుగా తమ హీరోను తీసుకువచ్చి.. సినిమా విషయాలే కాదు.. వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది ఆహా. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 ఎంత పెద్ద విజయం సాధించో చెప్పక్కర్లేదు.ఇప్పటికే పలువురు సినీరాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ షోలో ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన స్నేహితుడు మ్యాచో హీరో గోపిచంద్ తో కలిసి సందడి చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబర్ 29న స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్‏కు ఆహా యాప్ సైతం క్రాష్ కాగా.. ఇటీవల విడుదలైన సెకండ్ ఎపిసోడ్ కు ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇందులో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు హీరో గోపిచంద్. అంతేకాదు.. ఎప్పుడూ సరదాగా.. సైలెంట్‍గా కనిపించే డార్లింగ్ చిరాకు వస్తే ఏం చేస్తాడో కూడా చెప్పేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి బాగానే చర్చలు జరిగాయి. ఆ తర్వాత డార్లింగ్ వ్యక్తిగత విషయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేశాడు గోపిచంద్. ఈ క్రమంలోనే ప్రభాస్ చిరాకులో ఉంటే ఏం చేస్తాడంటూ బాలయ్య ప్రశ్న అడగ్గా గోపిచంద్ అసలు రహస్యం చెప్పేశాడు. తనకు చిరాకు వస్తే.. పక్కన ఉన్న అందరిని వెళ్లిపోమ్మంటాడు అని.. ఆ తర్వాత సైడ్ కు వెళ్లి సిగరెట్ తాగి వచ్చేస్తాడని సైగ చేస్తూ చూపించాడు. దీంతో డార్లింగ్ కు స్మోకింగ్ హ్యాబిట్ ఉందని అందరికి తెలిసిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రభాస్ కు చిన్నప్పటి నుంచి అడవులు అంటే చాలా ఇష్టమని.. ఖాళీగా ఉంటే స్నేహితులతో కలిసి అడవుల్లోకి వెళ్లిపోతానని.. అందుకే ఇక్కడ కూడా అడవిని దత్తత తీసుకున్నానని.. క్రూరమృగాలను కూడా పెంచొచ్చా ? అని ప్రభుత్వాన్ని అడిగానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డార్లింగ్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాత స్టాక్‌పై భారీ డిస్కౌంట్‌.. ఈ కార్లపై రూ.4.5 లక్షలు తగ్గింపు!
పాత స్టాక్‌పై భారీ డిస్కౌంట్‌.. ఈ కార్లపై రూ.4.5 లక్షలు తగ్గింపు!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. జస్ట్‌ ఒక్క టచ్‌తో..!
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
టీమిండియా కఠిన నిర్ణయం..నాలుగో టీ20 నుంచి తోపు ప్లేయర్ అవుట్?
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
యజమాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కుక్క..!
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే