Bigg Boss Telugu OTT: ఈసారి ఓటీటీ సీజన్ ఉంటుందా..? హోస్ట్ నాగ్ ఆర్ బాలయ్య..? ఇదిగో క్లారిటీ
సీజన్ 6 అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో ఈసారి ఓటీటీ సీజన్ ఆపివేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి..? ఇందులో నిజమెంత..? ఈ సారి సీజన్ హోస్ట్ నాగార్జున ఏనా..?
బిగ్ బాస్ సీజన్ 6.. వీక్షకులను తీవ్రంగా నిరూత్సాహపరిచిన విషయం తెలిసిందే. అంతా ఫేక్ వ్యవహారం నడిచింది. కంటెస్టెంట్స్ అందరూ.. హౌస్‌లోకి వెళ్లడానికి ముందే ఇంటర్య్యూలు రికార్డు చేయించుకుని.. హౌస్‌లోకి వెళ్లాక అవి రిలీజ్ అయ్యేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంటి లోపల అంతా ఫేక్ వ్యవహారం నడిచింది. ఒక కంటెస్టెంట్ కూడా తన రియల్ క్యారెక్టర్ బయటకు చూపించలేదు. ఏవేవో లూప్స్, అర్థం కానీ లాజిక్స్, ఫేక్ ఎమోషన్స్.. సీజన్ అంతా ఇలా సాగింది. ఇక గలాటా గీతు బిగ్ బాస్‌కే ఆట నేర్పే ప్రయత్నం చేసి.. బోల్తా పడింది. ఎలిమినేషన్స్, నామినేషన్స్.. అంతా సీరియల్ డ్రామా నడిచింది. ఫినాలేలో జరిగిన డ్రామా అయితే నవ్వు తెప్పించింది. మొత్తం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అట్టర్ ప్లాఫ్.
బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ గతేడాది.. ఓటీటీ షో కూడా రన్ చేసిన విషయం తెలిసిందే. అందులో బిందు మాధవి విజేతగా నిలవగా.. అఖిల్ సార్ధక్ రన్నరప్ అయ్యాడు. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఉంటుందా అనే విషయంపై చాలామందికి డౌట్స్ వచ్చాయి. ఈ సారి స్టార్ మా వాళ్లకి అలాంటి ఆలోచన లేదనే వార్తలు తొలుత వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ సర్కులేట్ అవుతుంది. ఏప్రిల్‌లో నాన్ స్టాప్ 2 షోని స్టార్ట్ చేసి.. జూన్ వరకూ ఈ షో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారట. ఓటీటీ కంప్లీట్ అయిన తర్వాత.. సెప్టెంబర్ నెలలో సీజన్ 7 స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..? సీజన్ 7కి కూడా హోస్ట్ నాగార్జునే అట. సీజన్ 6 అనుకున్న ఫలితం ఇవ్వకపోడంతో.. నాగార్జున హోస్టింగ్ నుంచి వైదోలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కింగ్ ప్లేసులో నటసింహం బాలయ్య హోస్ట్‌గా రంగంలోకి దిగుతున్నారని ప్రచారం జరిగింది. కానీ అదంతా వర్కువుట్ అవ్వదట. ఎందుకంటే.. పదో సీజన్ వరకూ నాగార్జునే హోస్టింగ్ చేయడానికి అగ్రిమెంట్ ఫైనల్ చేసుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ఈ విషయాలపై అఫీషియల్ అనౌన్సిమెంట్ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..