Dude Movie: ఆ తెలుగు హీరోతో అఫైర్ అంటూ ప్రచారం.. ‘డ్యూడ్’లో మెరిసిన ఈ కాంట్రవర్సీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం డ్యూడ్. మమిత బైజు కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా శుక్రవారం (అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఓ కాంట్రవర్సీ హీరోయిన్ తళుక్కున మెరిసింది.

లవ్ టుడే, డ్రాగన్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రం డ్యూడ్. కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ డ్యూడ్ సినిమాను నిర్మించడం విశేషం. దసరా కానుకగా శుక్రవారం (అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 20 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మమితా బైజునే మెయిన్ హీరోయిన్. అలాగే డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి మరో కీలక పాత్ర మెరిసింది.అయితే ఇదే సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. ఇటీవల టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన ఓ వివాదంలో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రముఖంగా వినిపించింది. తన భర్తతో ఈ హీరోయిన్ అఫైర్ పెట్టుకుందంటూ ఓ టాలీవుడ్ హీరో భార్య సంచలన ఆరోపణలు చేసింది. దీంతో బ్యూటీ పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది.
డ్యూడ్ సినిమాలో మమితతో పాటు ఐశ్వర్య శర్మ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. రోల్ చిన్నదే అయినా సినిమాలో ఆమె చాలా సీన్స్ లో కనిపిస్తుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఐశ్వర్య శర్మ తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న ధర్మ మహేష్ నటించిన డ్రింకర్ సాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన ధర్మ మహేష్ భార్య గౌతమి ఐశ్వర్యపై సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో ఈ హీరోయిన్ కు ఎఫైర్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఐశ్వర్య ఈ ఆరోపణలపై స్పందించలేదు. కానీ ధర్మ మహేష్ మాత్రం తన భార్య ఆరోపణలన్నింటినీ కొట్టి పారేశాడు. ఇప్పుడీ వివాదం సమసిపోయినట్లే కనిపిస్తోంది.
హీరో ప్రదీప్ రంగనాథన్ తో ఐశ్వర్య శర్మ..
View this post on Instagram
డ్యూడ్ సినిమా ప్రమోషన్లలో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








