AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి ?.. ఆమె గాత్రం వింటే మైమరచిపోవాల్సిందే.

ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె పాట పాడితే కోయిల సైతం అసూయపడుతుంది. దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు ఆలపించి శ్రోతలను ఆకట్టుకుంది. ఆమె స్వరం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రేమను చూపించడమే కాదు.. ఆమె గాత్రం నవ్విస్తుంది.. మదిని తాకి కన్నీరు పెట్టిస్తుంది.

Tollywood: ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి ?.. ఆమె గాత్రం వింటే మైమరచిపోవాల్సిందే.
Tollywood
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2023 | 1:21 PM

Share

పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె పాట పాడితే కోయిల సైతం అసూయపడుతుంది. దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు ఆలపించి శ్రోతలను ఆకట్టుకుంది. ఆమె స్వరం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రేమను చూపించడమే కాదు.. ఆమె గాత్రం నవ్విస్తుంది.. మదిని తాకి కన్నీరు పెట్టిస్తుంది. భయపెడుతుంది. ఇలా అన్ని భావోద్వేగాలను పలికిస్తుంది. తనే లెజండరీ సింగర్ కె.ఎస్ చిత్ర. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. 1963 జూలై 27న కేరళలోని త్రివేండ్రంలోని సంగీతకారుల కుటుంబంలో జన్మించింది చిత్ర. అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి. చిన్నతనంలోనే ఆలిండియా రేడియోలో రెండేళ్ల కృష్ణుడికి పాట పాడింది చిత్ర.

1979లో చిత్ర గురువు ఎం.జి. రాధకృష్ణన్ ఆమె చేత మాలయాళి సినిమాలో ఓ పాట పాడించాడు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 1982లో మళ్లీ ఓ యుగళగీతం పాడింది. సింధుభైరవి సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానను అనే పాటను తెలుగుతోపాటు తమిళంలో చిత్ర పాడింది. తెలుగులో ఆమె పాడిన మొదటిపాట ఇదే. ఆ తర్వాత దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు పాడింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్ పురస్కారాలతో సన్మానించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by K S Chithra (@kschithra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
భారత్‌తో మ్యాచ్ ఆడకున్నా.. ఈజీగా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.!
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది
గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ మంచిదేనా.?
గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ మంచిదేనా.?
కృష్ణకు ఇష్టమైన తెలుగు హీరో.. అతడు న్యాచురల్ ఆర్టిస్ట్..
కృష్ణకు ఇష్టమైన తెలుగు హీరో.. అతడు న్యాచురల్ ఆర్టిస్ట్..
ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..
ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..
ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?
ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?
ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి