AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే మళ్లీ వాటి జోలికెళ్లరు..

అన్నం తిన్నాక ఏదైనా తీపి పదార్థం నోట్లో పడాల్సిందేనా..? లేదంటే భోజనం పూర్తి కాలేదన్న వెలితిగా అనిపిస్తోందా? అయితే ఇది కేవలం మీ మనసు కోరుకుంటున్న రుచి మాత్రమే కాదు.. మీ శరీరం లోపల జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం.. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం నుంచి పోషకాహార లోపం వరకు.. ఈ తీపి కోరికల వెనుక దాగి ఉన్న షాకింగ్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే మళ్లీ వాటి జోలికెళ్లరు..
Why Your Body Demands Sweets After Meals
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 1:30 PM

Share

మన భారతీయ సంప్రదాయంలో భోజనం తర్వాత ఒక స్వీట్ ముక్క నోట్లో వేసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న అలవాటు. అయితే ఈ కోరిక కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దీని వెనుక అనేక శారీరక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు తిన్న వెంటనే తీపి పదార్థాలు తినాలని ఎందుకు అనిపిస్తుంది? దీనిని నియంత్రించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

తీపి కోరికలకు ప్రధాన కారణాలు ఇవే

రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులు

మన ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, తిన్న తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. ఇలా చక్కెర స్థాయిలు తగ్గగానే, శరీరం తక్షణ శక్తి కోసం మళ్లీ స్వీట్లను కోరుకుంటుంది.

పోషకాహార లోపం

మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందనప్పుడు అది తీపి రూపంలో శక్తిని అడుగుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయని డైట్ కోచ్ తులసి నితిన్ వివరిస్తున్నారు.

డీహైడ్రేషన్

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శరీరానికి దాహం వేసినప్పుడు వచ్చే సంకేతాలను మనం ఆకలిగా పొరబడతాం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, శక్తి కోసం ఏదైనా తీపి పదార్థం తినాలనే భ్రమ కలుగుతుంది.

అలసట – ఒత్తిడి

రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు, మెదడుకు వెంటనే గ్లూకోజ్ అందాలని శరీరం భావిస్తుంది. అందుకే అలసటగా ఉన్నప్పుడు తీపి తినాలనే కోరిక తీవ్రంగా ఉంటుంది.

నియంత్రించడం ఎలా?

నీరు తగినంత తాగాలి: భోజనానికి ముందు, తర్వాత శరీరానికి తగినంత హైడ్రేషన్ ఇస్తే తీపి కోరికలు తగ్గుతాయి.

ప్రోటీన్ ఆహారం: భోజనంలో పప్పులు, గుడ్లు లేదా పీచు పదార్థం ఎక్కువగా ఉంటే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

పండ్లకు ప్రాధాన్యత: స్వీట్లు, కేకులకు బదులుగా ఖర్జూరాలు లేదా పండ్లను తీసుకోవడం ఉత్తమం.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..