AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrahas : చంద్రహాస్ బూతు సాంగ్ కాంట్రవర్సీ.. స్పందించిన నిర్మాతలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు చంద్రహాస్. మొదటి సినిమాతోనే యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బూతు పాటతో రెచ్చిపోయాడు చంద్రహాస్. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం నెలకొంది. దీంతో ఈ కాంట్రవర్సీపై చిత్ర యూనిట్ ఎట్టకేలకు మౌనం వీడింది.

Chandrahas : చంద్రహాస్ బూతు సాంగ్ కాంట్రవర్సీ.. స్పందించిన నిర్మాతలు..
Chandrahas Song Controversy
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2026 | 12:47 PM

Share

నాటు నాటు పాటకు ఆస్కారే దిగివచ్చింది. అందులోని సాహిత్యం అలాంటిది. ఆ పాటకున్న స్టామినా ఆ రేంజ్‌ మరి. ప్రతీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, లిరిసిస్ట్‌ ఆస్కార్‌ రేంజ్‌లో ఆలోచిస్తూ పాటలు రచిస్తున్న సమయంలో వచ్చాడండీ.. చంద్రహాస్‌. ఓవైపు ఒక్క బూతు రెండు పార్టీల మధ్య నిప్పు పెడితే.. ఓ బూతు పాటనే రాసి.. జనాలపై రుద్ది.. ఎప్పుడూ బూతులు వినలేదా అంటూ ఎదురుమాట్లాడుతున్నాడు ఈ నటుడు. ఇలాంటి పాటలతో తెలుగు సినిమాని ఎక్కడికి తీసుకెళ్దామని? అసలు మీరేం పాడుతున్నారో మీకైనా అర్ధమవుతోందా? ఇదే పాటని మీ ఇంట్లో పాడగలవా? అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. టీవీ నటుడు ప్రభాకర్‌ కొడుకే ఈ చంద్రహాస్‌. తొలి సినిమా లాంచింగ్‌తోనే యాటిట్యూడ్‌ స్టార్‌ అనే పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు చంద్రహాస్‌ బరాబర్‌ ప్రేమిస్తా అనే సినిమాలో నటించాడు. ఆ చిత్రం నుంచి జాలువారిన ఆణిముత్యమే ఈ బూతు సాంగ్‌.

సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మైక్‌ పట్టుకుని పెర్ఫామెన్స్‌ ఇవ్వడం ఇంకో లెవెల్‌. చాలామంది ఈ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిమరీ ఖండించారు. ఈ దిగజారుడు సాహిత్యం.. ఇలాంటి బూతు పాటలతో సినిమాలు తీసి జనాలపై రుద్దకండి అంటూ మండిపడుతున్నారు. ఇతడు పాట పాడే సమయంలో చాలామంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల సమక్షంలోనే తన టాలెంట్‌ను బయటపెట్టాడు. ఈ బూతు పాటపై దుమారం రేగుతున్నా.. తాను తప్పేం అనేలేదు అంటూ సమర్థించుకుంటున్నాడు చంద్రహాస్‌. తనపై అటెన్షన్‌ క్రియేట్‌ కావాలి, సినిమా ప్రమోట్ కావాలనే చేశానంటున్నాడు.

తప్పు చేశాను క్షమించండి అంటే అయిపోద్ది కానీ.. చంద్రహాస్‌ తప్పేం లేదని సమర్థించుకుంటున్నాడు. బరాబర్‌ ప్రేమిస్తా సినిమా ఈవెంట్‌కు వచ్చిన వాళ్లలో సీనియర్‌ యాక్టర్‌ జేడీ చక్రవర్తి మాత్రం ఆ బూతులను ఒప్పుకోవడం లేదు. కొంచెం బుర్రపెడితే ఇంకా మంచి మంచి ప్రమోషన్లు చేయొచ్చంటున్నారు జేడీ. ఇలాంటి బూతు పురాణాలు బూతు పాటలు పాడితే తిట్లు తినడం తప్ప ఇంకోటి రాదన్నది జేడీ వాదన.

ఇదిలా ఉంటే.. చంద్రహాస్ బూతు పాట వివాదంపై చిత్ర నిర్మాతలు స్పందించారు. స్టేజ్ మీద జరిగిన అనుచిత ప్రవర్తనపై నిర్మాత గాయత్రి చిన్ని, దర్శకుడు సంపత్ రుద్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై నిర్మాత, దర్శకుడు స్పందిస్తూ.. తన క్యారెక్టరైజేషన్‌ గురించి చెప్పే ఉద్దేశంతోనే హీరో చంద్రహాస్‌ అలాంటి పాట పాడారని చెప్పారు. సినిమాలో ఆ పాటా అలా ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈవెంట్ చంద్రహాస్‌ అలా పాట పాడటంపై రిగ్రెట్‌ ఫీల్ అవుతున్నామంటూ వీడియో రిలీజ్‌ చేశారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

Follow Us