AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్.. ఎవరా టీమిండియా ప్లేయర్ అంటే.?

అండర్-19 సెమీఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ తృటి మిస్ చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగులు చేసి ఉంటే యాక్టివ్ ఆటగాళ్లలో టాప్ స్కోరర్‌గా నిలిచేవాడు. సెంచరీ సాధిస్తే బాబర్ అజమ్ రికార్డును అధిగమించి, అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించేవాడు.. కానీ చివరికి 68 పరుగులకు అవుట్ అయ్యాడు.

Team India: ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్.. ఎవరా టీమిండియా ప్లేయర్ అంటే.?
Team India
Ravi Kiran
|

Updated on: Feb 05, 2026 | 1:36 PM

Share

అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో, ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అరుదైన రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ సెమీఫైనల్ ముందు వరకు 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడితే, అతను అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రను తిరగరాసేవాడు. ఈ సెమీఫైనల్‌లో వైభవ్ భారీ పరుగులు సాధిస్తే, అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్‌లలో నంబర్ వన్ ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచేవాడు. ప్రస్తుతం అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ఆటగాళ్లలో బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీం అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 37 మ్యాచ్‌లలో, 35 ఇన్నింగ్స్‌లలో 1261 పరుగులు సాధించాడు. అజీజుల్ హకీం సగటు 42.03 కాగా, స్ట్రైక్ రేట్ 74.89 గా ఉంది. ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించడంతో, అజీజుల్ హకీం రికార్డు పదిలం కాదు. .

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 23 మ్యాచ్‌లలో 23 ఇన్నింగ్స్‌లలో 1169 పరుగులు చేసి, యాక్టివ్ ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అతని సగటు 50.82 కాగా, స్ట్రైక్ రేట్ 158.18 గా ఉంది. అండర్-19 వన్డే చరిత్రలో ఏ బ్యాట్స్‌మన్ కైనా ఇది అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం గమనార్హం. అజీజుల్ హకీం రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకోవాలంటే వైభవ్‌కు సెమీఫైనల్‌లో 93 పరుగులు అవసరం. యాక్టివ్ ప్లేయర్‌లలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ అండర్-19 వన్డే రికార్డును కూడా బద్దలు కొట్టేవాడు. బాబర్ అజమ్ 36 అండర్-19 వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌లలో 1271 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బాబర్ అజమ్ సగటు 38.51 కాగా, స్ట్రైక్ రేట్ 73.85 గా ఉంది. పరుగుల పరంగా బాబర్ అజమ్ రికార్డును అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీకి 103 పరుగులు అవసరం.

అంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఒక సెంచరీ సాధిస్తే, అతను అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, బాబర్ అజమ్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టగలడు. ఈ అరుదైన అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు వైభవ్.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేవలం 68 పరుగులు చేసి.. అవుట్ అవడంతో.. ఈ రెండు రికార్డుల కోసం మనం ఫైనల్ వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..
ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..
ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?
ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?
ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.