AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి.. అప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలతో బిజీ.. బిజీ..

90'sలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆ తార.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలతో మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి

Tollywood: అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి.. అప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలతో బిజీ.. బిజీ..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2023 | 9:37 PM

Share

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 90’sలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆ తార.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలతో మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కథానాయికగానే కాదు.. ప్రతినాయికగానూ కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

అమాయకంగా కనిపిస్తోన్న ఆ అమ్మాయి.. హీరోయిన్ రమ్యకృష్ణ. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన ఆమె.. 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమాతో తెరంగేట్రం చేసింది. 1990 నుంచి 2000 వరకు ఎన్నో టాప్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించింది. అల్లరి మొగడు, అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, అల్లుడు గారు, ఆవిడే శ్యామల, ఆహ్వానం, చంద్రలేఖ, అన్నమయ్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్‏గా వరుస అవకాశాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో విలన్ పాత్రలో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య కలిసి నటించిన నరసింహా చిత్రంలో ప్రతినాయికగా కనిపించింది. ఇందులో రజినీతో పోటీపడి మరీ నీలాంబరి పాత్రను రక్తి కట్టించింది. డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమ పెళ్లి చేసుకున్నారు రమ్యకృష్ణ. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తండ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.