Tollywood: రెడ్ డ్రెస్లో హోయలుపోతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. పాలతో చేసిన అందం ఆమెది..
సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు గడుస్తున్నా టాప్ హీరోయిన్గా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చేస్తూ మెప్పిస్తుంది. గుర్తుపట్టారా ?.. సౌత్ కాదు.. నార్త్ లోనూ ఈ అమ్మడి హావా కొనసాగుతుంది.

పైన ఫోటోలో రెడ్ డ్రెస్లో హోయలు పోతున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు గడుస్తున్నా టాప్ హీరోయిన్గా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చేస్తూ మెప్పిస్తుంది. గుర్తుపట్టారా ?.. సౌత్ కాదు.. నార్త్ లోనూ ఈ అమ్మడి హావా కొనసాగుతుంది. ఇటీవలే సినిమాల గురించి కాకుండా ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాల గురించి చర్చ నడుస్తోంది. తనే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
2006లో శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమన్నా. ఈ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఊసరవెల్లి, రచ్చ, రెబల్ చిత్రాలతోపాటు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ తమన్నా జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.




ప్రస్తుతం తమన్నా భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మరోసారి చిరు జోడిగా కనిపించనుంది. ఈ సినిమాతోపాటు.. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. మరోవైపు ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ చేసింది తమన్నా. అదే సమయంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
