Tollywood: ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. అతి తెలివితో అవకాశాలకు దూరమయ్యింది.. ఎవరో గుర్తుపట్టండి.
అందరి చూపు అమ్మాడిపైనే.. సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ చిన్న చిన్న పొరపాట్లతోనే వచ్చిన అవకాశాలు వెనుదిరిగాయి. దీంతో ఒకటి రెండు చిత్రాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ఎవరో గుర్తుపట్టండి. క్యాప్ పెట్టుకుని స్టైలీష్ గా ఉన్న ఆ చిన్నారి

పైన ఫోటోలోని చిన్నారి దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితం. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన ఓ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక ఆ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అందరి చూపు అమ్మాడిపైనే.. సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ చిన్న చిన్న పొరపాట్లతోనే వచ్చిన అవకాశాలు వెనుదిరిగాయి. దీంతో ఒకటి రెండు చిత్రాల్లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ఎవరో గుర్తుపట్టండి. క్యాప్ పెట్టుకుని స్టైలీష్ గా ఉన్న ఆ చిన్నారి కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో ఈ అమ్మడు వెండితెరకు పరిచయమైంది. కేజీఎఫ్ 1, 2లో నటించి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో శ్రీనిధికి తెలుగుతోపాటు.. తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ కేజీఎఫ్ ఎఫెక్ట్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా అప్పట్లో టాక్ నడిచింది. అయితే శ్రీనిధికి అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేయడంతో అవకాశాలు చేజారిపోయాయి. కేజీఎప్ ఫ్రాంఛైజీ తర్వాత ఆమె నటించిన చిత్రం కోబ్రా. విక్రమ్ చియాన్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత శ్రీనిధి నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు.




1991 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది శ్రీనిధి. బెంగుళూరులోని జైన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ కర్ణాటక .. మిస్ బ్యూటీఫుల్ స్మైల్.. 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్ అందుకుంది. 2018లో కేజీఎఫ్ సినిమా ద్వార సినీరంగంలోకి అడుగుపెట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




