Actress: పాముతో ధైర్యంగా పోజులిచ్చిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? 500కు పైగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకున్న నటి
పై ఫొటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా నిల్చున్న అమ్మాయిని గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఓ స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్ ట్యాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. ఇలా ఏరోల్ లోనైనా ఇట్టే ఇమిడిపోగలదు
పై ఫొటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా నిల్చున్న అమ్మాయిని గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఓ స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్ ట్యాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. ఇలా ఏరోల్ లోనైనా ఇట్టే ఇమిడిపోగలదు. అయితే గతంలో లాగా ప్రస్తుతం ఈ నటి పెద్దగా సినిమాలు చేయడం లేదు. తన మకాం కూడా ముంబైకి మార్చేసింది. అయినా వార్తల్లో నిలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించిన ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 500 కు పైగా సర్కారీ స్కూళ్లను దత్తత తీసుకుంది. ప్రభుత్వ అధికారుల సహాయంతో పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోంది. మరి ఈ టాలీవుడ్ తారను గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు ప్రముఖ నటి మంచు లక్ష్మి.
సిద్ధార్థ్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్ టాకీస్, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్‌స్టర్ (మలయాళం) వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది మంచులక్ష్మి. అంతేకాదు పలు హిట్ సినిమాల నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తోంది మంచులక్ష్మి. ఇందులో మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మి వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మి నిర్మాతలు. ఈ సినిమాతో పాటు యక్షిణి ఒక హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోనూ నటించింది మంచులక్ష్మి. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.
యక్షిణి వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి..
Meet Jwala, the mysterious one 😳#YakshiniVasthundi Coming Soon in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, Bangla, Marathi only on #DisneyPlusHotstar@Vedhika4u @ActorRahulVijay @LakshmiManchu @UrsAjayRavuri @arkamediaworks @Shobu_ @DirTejaMarni @sharma_sowmya18… pic.twitter.com/XgaxueiGKA
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.