Tollywood: అమ్మచేతి గోరుముద్దలు తింటున్న ఈ చిన్నోడు ఓ స్టార్ హీరో తనయుడు.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు.. గుర్తుపట్టండి..
తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. తన కామెడీ టైమింగ్ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించాడు. ఎవరో గుర్తుపట్టండి.
అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. అంతేకాదు.. ఓ స్టార్ హీరో తనయుడు కూడా. సెలబ్రెటీ కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా .. నటనకు ప్రశంసలు అందుకున్నారు. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. తన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించాడు. ఎవరో గుర్తుపట్టండి. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కనిపెట్టండి. అతను మరెవరో కాదు.. హీరో మంచు మనోజ్. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించి చాలా రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్.. దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత బిందాస్ సినిమాకుగానూ నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ, ఝుమ్మంది నాదం వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మనోజ్.
తాజాగా తన తల్లి నిర్మల దేవి పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ.. తన చిన్ననాటి ఫోటో షేర్ చేసుకున్నారు. నా ప్రాణానికి ప్రాణం అయిన అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఫోటో వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.