ఫిజిక్ తో ఫిదా అందాల భామ ఆదా శర్మ

Phani CH

13 January 2025

Credit: Instagram

తెలుగు ప్రేక్షకులకు ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఓ పాత్ర పోషించింది అదా. ఆ తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినా అదాకి పెద్దగా ఉపయోగపడలేదు.

మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పలు చిత్రాల్లె సెకండ్ హీరోయిన్‏గా కనిపించింది.

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. రీసెంట్ గా కేరళ స్టోరీ సినిమాతో హిట్ అందుకుంది. అలాగే పలు సినిమాలు చేస్తోంది. 

కేరళ స్టోరీ సినిమా తర్వాత అదా శర్మకు భిన్నమైన గుర్తింపు వచ్చింది. అదా శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది ఆదా శర్మ. ఇటీవలే బస్తర్ ది నక్సల్స్ స్టోరీ అనే చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది ఆదా శర్మ. ఇటీవలే బస్తర్ ది నక్సల్స్ స్టోరీ అనే చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది.