Unstoppable 2: పక్కా సమాచారం.. అన్‌స్టాపబుల్ 2కు రానున్న పవర్ స్టార్… రచ్చ రంబోలా
బాలయ్య, పవన్.. వీరిద్దరి పూర్తిగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. ఇద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తోపులు. రెండు కుటుంబాల మధ్య సినిమాల పరంగా పోటీతత్వం ఉంటుంది. వారిద్దరూ ఒకే చోట.. ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే..?
ఆహా వేదికగా నడుస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో ఓటీటీ రేటింగులు బద్ధలు కొట్టిన ఈ షో.. రెండవ సీజన్ ఓపెనింగ్ అంతకన్నా అదుర్స్ అనేలా ఉంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందినవారు గెస్టులుగా వచ్చి అలరించారు. తాజాగా మరో బోనంజా న్యూస్ వచ్చేసింది. పక్కా సమాచారం అందింది. అన్‌స్టాపబుల్ 2 లో సందడి చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇది నందమూరి, మెగా అభిమానులకు పండగ లాంటి విషమమే. అసలు ఈ కాంబో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్.
ఇద్దరు లార్జెర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోలు తొలిసారి ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. వారు ఏమేం ముచ్చటిస్తారు. ఎలాంటి అనుభవాలు షేర్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు రూమర్‌గా ఉన్న ఈ వార్త.. ఇప్పుడు నిజమని తేలిపోవడంతో.. అటు మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రజంట్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే.. అంతకు మించిన బోనంజా న్యూస్ రావడంతో అటు అన్‌స్టాపబుల్ అభిమానులు సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు.
దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే అంటూ అన్‌స్టాపబుల్ 2తో రంగంలోకి దిగారు నందమూరి నటసింహం. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం చంద్రబాబు, లోకేష్‌లను పిలిచి అమాంతం బజ్ పెంచారు. ఈ సీజన్ రెండో ఎపిసోడ్ అంతకుమించి అన్నట్లుగా ప్లాన్ చేసింది ఆహా టీం. సిద్దు జొన్నలగడ్డతో పాటు మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ లను బాలయ్య ఫుట్ బాల్ ఆడుకున్నారు. థర్డ్ ఎపిసోడ్ కోసం అడవి శేష్, శర్వానంద్‌లను పిలిచి.. ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాలయ్య స్నేహితులు, పొలిటిషన్స్ అయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలను రప్పించి.. సందడి చేశారు. ఆ నెక్ట్స్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావులు వచ్చారు. తాజాగా ప్రభాస్, గోపిచంద్ వచ్చి.. సందడి చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ సైతం అయిపోయింది. తర్వాత ఎపిసోడ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే న భూతో న భవిష్యతి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.