Bigg Boss Sohel: డిప్రెషన్‏తో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న బిగ్‏బాస్ సోహైల్.. ఆ చేదు రోజులను గుర్తుచేసుకుంటూ..

సినిమాలపై ఉన్న ఇష్టంతో నటుడిగా మారేందుకు ఎంచుకున్న దారిలో ఎదురైన సవాళ్లు.. మాటలతో ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట. అందుకు గల కారణాలను ఇటీవల అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు సోహైల్.

Bigg Boss Sohel: డిప్రెషన్‏తో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న బిగ్‏బాస్ సోహైల్.. ఆ చేదు రోజులను గుర్తుచేసుకుంటూ..
Sohel
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2022 | 6:36 PM

సోహైల్.. బిగ్ బాస్ ముందువరకు ఈ పేరు అంతగా ప్రజలకు తెలియదు. కానీ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు పలు సీరియల్స్.. సినిమాల్లో నటించాడు కానీ అంతగా గుర్తింపు రాలేదు. అప్పుడే కోపం.. అప్పుడే స్నేహం… తన అల్లరితో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హోస్ లో ఉన్నప్పుడు అరియానాతో వైరం.. ఫ్రెండ్ షిప్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సోహైల్.. జీవితంలో మాత్రం అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రస్తుతం స్థాయికి చేరుకున్నాడు. సినిమాలపై ఉన్న ఇష్టంతో నటుడిగా మారేందుకు ఎంచుకున్న దారిలో ఎదురైన సవాళ్లు.. మాటలతో ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట. అందుకు గల కారణాలను ఇటీవల అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు సోహైల్. తన స్నేహితుడు.. రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి అలీతో సరదాగా షోలో పాల్గొన్న సోహైల్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

ఎప్పుడు సరదాగా ఉండే సోహైల్ కు సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది ? అని అడగ్గా.. సోహైల్ మాట్లాడుతూ.. ” నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి.. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడిగేవారు. ఎప్పుడు సెటిల్ అవుతావు ?.. అని. కానీ నాకేమో సినిమాలంటే ఇష్టం. అప్పటికీ రెండు సినిమాల్లో నటించాను కానీ. హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోఉద్యోగమంటూ ఒత్తిడి. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా … నా గమ్యం ఇది కాదు అని వెనక్కు వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. కానీ ఇలా నేను ఉండటానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోహైలే చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో లక్కీ లక్ష్మణ్ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..