AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం మీదే!

ఆర్థికంగా బలపడాలని, ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండకూడదని, ఆర్థిక కష్టాలు కూడా ఉండదని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. వాస్తు శాస్త్రాన్ని కూడా ప్రజలు బాగా విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల రెమిడీలు చేస్తే.. అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. మరి అవేంటో చూడండి..

Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం మీదే!
Vastu Tips
Chinni Enni
|

Updated on: Dec 27, 2024 | 6:43 PM

Share

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాదు ఇంట్లోని అన్ని వస్తువులతో ముడి పడి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు, ఇంటి గొడవలు, కుటుంబ సభ్యుల తగాదాలు దూరమవుతాయని, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అవుతుందని వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ఇంటి సభ్యులకు అదృష్టం కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ వస్తువులు ఏంటి? ఇప్పుడు తెలుసుకోండి.

లాఫింగ్ బుద్ధ:

లాఫింగ్ బుద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి అందరికీ తెలుసు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ధనం ప్రవాహం కూడా కలుగుతుందని జనాలు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటారు. గిఫ్టుల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉత్తర దిక్కున హాల్‌లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సంపద కూడా పెరుగుతుంది.

ఈవిల్ ఐ లాకెట్స్:

ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐ లాకెట్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. వీటిని కూడా గిప్టులుగా ఇస్తున్నారు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొటుంది. వీటిని ఎక్కువగా ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల ప్రజలు వాడతారు. వీటి వలన దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది.

తాబేలు:

తాబేలును ఇంట్లో పెంచుకున్న వాటికి సంబంధించిన బొమ్మలు పెట్టుకున్నా మంచిదని నమ్ముతారు. వీటిని ఇంట్లో తూర్పు దిక్కులో పెట్టుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొని, సంపద పెరుగుతుందని విశ్వసిస్తారు.

ఏనుగు విగ్రహాలు:

పంచ లోహాలతో చేసిన ఏనుగు విగ్రహాలు కానీ, వెండితో చేసిన విగ్రహాలు కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి.. సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఏనుగు విగ్రహాలను ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!