AP News: పర్ల పుంజా.. మజాకా.! బరిలోకి దిగితే ఇక అంతే.. ఈ పందెం కోళ్లకు ఫుల్ డిమాండ్..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాల్లో సందడి మొదలవుతుంది. పందెం కోళ్లతో పందెం రాయుళ్లు పోటీలకు సిద్దం అవుతారు. కొన్ని అరుదైన జాతులకు చెందిన కోడి పుంజులను తెప్పించి.. వాటికీ జీడిపప్పు లాంటివి ఇచ్చి బాగా మేపుతారు.

AP News: పర్ల పుంజా.. మజాకా.! బరిలోకి దిగితే ఇక అంతే.. ఈ పందెం కోళ్లకు ఫుల్ డిమాండ్..
Cockfights
Follow us
B Ravi Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Dec 27, 2024 | 6:38 PM

సంక్రాంతి పండుగ వస్తుందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో సందడి మొదలవుతుంది. తెలంగాణ నుంచి మాత్రమే కాదు.. ఎక్కడెక్కడ వారైనా ఏపీకి.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. వచ్చే బంధుమిత్రులు, అతిధుల కోసం అందరూ తమ తమ స్ధాయిలో ఏర్పాట్లు చేస్తారు. అయితే బరిలో దిగే పందెం పుంజులు ఎన్ని రకాలు ఉంటాయి. అందులో ప్రత్యేకంగా జాతులు ఉన్నాయా.? వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..

పందెం కోళ్లలో రకాలు..

ముఖ్యంగా కోడి పందాలు వేసేందుకు పందాల రాయుళ్లు కోడిపుంజులను ముందు నుంచే సిద్ధం చేస్తారు. పుంజులు రంగులను బట్టి వాటి జాతుల పేర్లను నిర్ణయిస్తారు. ఈకల రంగులు బట్టి పందెం కోళ్ల రకాలు విభజించబడ్డాయి..

కాకి – నల్లని ఈకలు గల కోడి పుంజు

ఇవి కూడా చదవండి

సేతు – తెల్లని ఈకలు గల కోడి పుంజు

పర్ల – మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజు

సవల – మెడపై నల్లని ఈకలు గల కోడి పుంజు

కొక్కిరాయి (కోడి) – నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గల కోడి పుంజు

డేగ – ఎర్రటి ఈకలు గల కోడి పుంజు

నెమలి – రెక్కలపై, లేక వీపు పై పసుపు రంగు ఈకలు గల కోడి పుంజు

కౌజు – నలుపు, ఎరుపు, పసుపు ఈకలు గల కోడి పుంజు

మైల – ఎరుపు, బూడిద రంగుల ఈకలు గల కోడి పుంజు

పూల – ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల కోడిపుంజు

పింగళ – తెలుపు రెక్కల పై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు

నల్లబోర, ఎర్రపొడ

ముంగిస – ముంగిస జూలు రంగు గల పుంజు

అబ్రాసు – లేత బంగారు రంగు ఈకలు గల పుంజు

గేరువా – తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు

మిశ్రమ రకాలు: కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి, తెలుపు గౌడు(నలుపు, తెలుపు ఈకలు గల కోడి పుంజు), ఎరుపు గౌడు(నలుపు, ఎరుపు ఈకలు గల కోడి పుంజు), నల్ల సవల(రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు), నల్ల మచ్చల సేతు(తెల్లని ఈకలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు). ఈ కోడి పుంజులలో కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ ప్రసిద్దమైనవి, ఖరీదైనవి.

అరుదైన పుంజు ఏడు కోపురాలు:

అన్ని జాతుల కోడిపుంజులలోనూ అరుదుగా కొన్ని కోడి పుంజులకు నెత్తి మీద ఏడు కోపురులు.. కింద గెడ్డం వస్తుంది. వీటిని పందెం రాయుళ్లు వాడుక భాషలో పట్టిడా లేదా ఏడు కోపురుల జాతి పుంజులు అని పిలుస్తారు. ఇవి మామూలు కోడి పుంజులకన్నా ధర ఎక్కువ పలుకుతాయి. కారణం అరుదుగా దొరికే పుంజుల కావడం. పందెంలో వీరోచితంగా పోరాడటం వీటి లక్షణం. అయితే కొందరు పందెం రాయుళ్లు వీటి తలపై కొప్పును, గడ్డంను ముందుగానే కత్తిరించి వేస్తారు. కారణం ఎక్కువ కొప్పు ఉంటే పందెంలో అవతలి కోడి పుంజుకు దొరికేస్తుందని.. కొప్పు గడ్డం ఉండటం వలన పందెంలో పోరాడే సమయంలో తల బరువుగా ఉండి స్పీడ్‌గా పోరాడలేవని వాటిని కత్తిరిస్తారు పందెం రాయుళ్లు. మొత్తానికి పందెం పుంజు నెత్తి మీద కిరీటంలా కొపురు.. కింద గడ్డం ఉంటే మంచి అందంగా ఉండి ఆకర్షిస్తాయి ఈ పుంజులు. మరికొందరు పందెం కోళ్లు మకాం వద్ద ఎంట్రన్స్‌లోనే వీటిని దిష్టి కోడిగా కూడా ఉంచుతారు.

ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!