AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: ఈ ఫొటోలో ఉన్నది టాలీవుడ్‌ హీరోయిన్‌.. పక్కనే స్టార్‌ డైరెక్టర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫొటోలోని అందాల తార తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. హీరోయిన్‌గా సుమారు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో హవా సాగించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అయితే ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. చాలామందిలాగే గ్యాప్‌ తీసుకుని మళ్లీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అక్క, వదిన, తల్లి పాత్రల్లో స్పెషల్‌ రోల్స్‌ చేస్తోంది.

Guess The Actress: ఈ ఫొటోలో ఉన్నది టాలీవుడ్‌ హీరోయిన్‌.. పక్కనే స్టార్‌ డైరెక్టర్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Celebrities
Basha Shek
|

Updated on: Nov 17, 2023 | 8:03 AM

Share

పై ఫొటోలో ఉన్నది ఒక తెలుగు హీరోయిన్‌.. పక్కనే హీరోలా పోజులిస్తోన్నది ఒక స్టార్‌ డైరెక్టర్‌.. వారెవరో గుర్తుపట్టారా? చాలా కష్టం.. అసలు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫొటో సుమారు 28 ఏళ్ల క్రితం నాటిది. ఈ ఫొటోలోని అందాల తార తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. హీరోయిన్‌గా సుమారు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో హవా సాగించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అయితే ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. చాలామందిలాగే గ్యాప్‌ తీసుకుని మళ్లీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అక్క, వదిన, తల్లి పాత్రల్లో స్పెషల్‌ రోల్స్‌ చేస్తోంది. అలాగే డ్యాన్స్‌ షోల్లో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. గుర్తుపట్టడం కొంచెం కష్టంగానే ఉంది కదా.. అయితే ఒక క్లూ.. శ్రీకాంత్ నటించిన ఖడ్గం సినిమాతో ఈ హీరోయిన్‌ తెలుగు నాట బాగా ఫేమ్‌ తెచ్చుకుంది. యస్‌.. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సంగీత. చెన్నైకు చెందిన ఈ అందాల తార తెలుగులో బోలెడన్నీ సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. పెళ్లాం ఊరెళితే, నవ్వుతూ బతకాలిరా, మా ఆయన చంటి పిల్లాడు, శివ పుత్రుడు, విజయేంద్ర వర్మ, సంక్రాంతి తదితర హిట్‌ సినిమాల్లో కనిపించింది.

పెళ్లి తర్వాత గ్యాప్‌ తీసుకున్న సంగీత 2020లో మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి’ఆచార్య’ మూవీలో తళుక్కున మెరిసింది. ఇక హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మసూద’లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషించింది. కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. ఇక సంగీత పక్కన ఉన్నది స్టార్‌ డెరెక్టర్‌ వెంకట్ ప్రభు. నాగచైతన్యతో కస్టడి సినిమాను తెరకెక్కించింది ఈ డైరెక్టర్‌. అంతకు ముందు సరోజ, గోవా, గ్యాంబ్లర్‌, బిర్యానీ వంటి హిట్‌ సినిమాలు తీశాడు. ప్రస్తుతం విజయ్‌ దళపతితో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సంగీత, వెంకట్ ప్రభు మంచి స్నేహితులు. తాజాగా వెంకట్‌ ప్రభు పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన ఫొటోను సంగీత షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

భర్తతో నటి సంగీత..

అందాల తారలు ఒకే చోట.. స్నేహ, సంగీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.