AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VJ Sunny: బిగ్ బాస్ ప్రైజ్ మనీ సగం వాళ్లే తీసుకున్నారు.. షాక్ ఇచ్చిన వీజే సన్నీ

ఇప్పటికే ఆరు సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా నిలిచాడు వీజే సన్నీ.

VJ Sunny: బిగ్ బాస్ ప్రైజ్ మనీ సగం వాళ్లే తీసుకున్నారు.. షాక్ ఇచ్చిన వీజే సన్నీ
Vj Sunny
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2023 | 8:22 AM

Share

ఇండియా బిగెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికే వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆరు సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా నిలిచాడు వీజే సన్నీ. ప్రతివారం బిగ్ బాస్  కంటెస్టెంట్‌లకు రెమ్యునరేషన్‌తో పాటు విన్నర్ కు రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ ఉంటుంది. అయితే తనకు ఇచ్చిన ప్రైజ్‌ మనీలో సగం వల్లే నొక్కేశారు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు వీజే సన్నీ.

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత వీజే సన్నీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సౌండ్ పార్టీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది .

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు బిగ్ బాస్ విన్నర్ గా వచ్చిన మనీలో సంగం ప్రభుత్వమే లాగేసుకుంది అన్నాడు. ప్రైజ్ మని 50 లక్షలు ఇవ్వాలి కానీ అందులో రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్లిపోయింది. ఆ డబ్బులు మొత్తం టాక్స్ రూపంలో తీసేసుకున్నారు అని అన్నాడు. సదరు ఛానల్ వాళ్లు టాక్స్‌ రూపంలో ఆ డబ్బు కట్‌ చేసుకుని మిగిలన డబ్బులు ఇచ్చారు. కరెక్ట్ గా లేదు కానీ రూ. 23 లక్షలు చేతికి వచ్చినట్లు తెలుస్తోంది అని అన్నాడు వీజే సన్నీ.

వీజే సన్నీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us