AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!

Telangana: తాజాగా ఎంపిడిఓ ఏసీబీ కి చిక్కడంతో కొంతమంది బాధితులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపిడిఓ కార్యాలయం ముందే టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ఎంపిడిఓ కొడుకు పెత్తనం చర్చకు దారి తీస్తుంది. ఆమె కొడుకు ను..

Telangana: ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
Acb Raid
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 8:31 AM

Share

ACB Raid: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో రాధికా ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఆమెతోపాటు ఎంపీఓ యాకయ్య, ఎంపీడీవో కుమారుడు నాగార్జున్ కూడా ఏసీబీకి చిక్కారు. ఎంపిడిఓ ఏసీబీ ట్రాప్ అవడంతో బాధితులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయం ముందే సంబరాలు జరుపుకోవడం చర్చగా మారింది

నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామ శివారులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వెంచర్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించాడు. అయితే సంబంధిత ఫైల్ క్లియర్ చేయడం, నాలా కన్వర్షన్ ప్రక్రియకు సహకరించడం కోసం లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.55 వేలు చెల్లించిన బాధితుడు, పని పూర్తికాకపోయినా మిగిలిన రూ.45 వేలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Locals Celebrate

Locals Celebrate

ఏసీబీ అధికారుల సూచనల మేరకు మిగిలిన నగదును అందజేస్తుండగా ఎంపీడీవో రాధికా, ఎంపీఓ కిన్నెర యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు నాగార్జున ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వారి వద్ద రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఐతే నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంలో గతంలో కూడా అవినీతి ఆరోపణలతో అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎంపిడిఓ ఏసీబీ కి చిక్కడంతో కొంతమంది బాధితులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపిడిఓ కార్యాలయం ముందే టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ఎంపిడిఓ కొడుకు పెత్తనం చర్చకు దారి తీస్తుంది. ఆమె కొడుకు ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..