AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో తెలుసుకోండి..

Chicken vs Paneer: బరువు తగ్గాలన్నా.. బాడీ పెంచాలన్నా అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం ప్రోటీన్. అయితే ఈ ప్రోటీన్ వేటలో నాన్ వెజ్ ప్రియులకు చికెన్.. వెజిటేరియన్లకు పనీర్ ఎప్పుడూ హాట్ ఫేవరెట్లే. కానీ అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేని తింటే కొవ్వు కరుగుతుంది? దేనితో మజిల్ పెరుగుతుంది? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ ఆసక్తికరమైన నిజాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jun 13, 2026 | 8:10 AM

Share
కేలరీలు, ఫ్యాట్ లెక్కలు: బరువు తగ్గాలని డైట్ చేసేవారికి కేలరీలు, కొవ్వు శాతాలు చాలా ముఖ్యం. లీన్ చికెన్‌లో కార్బోహైడ్రేట్లు అస్సలు ఉండవు. పైగా ఫ్యాట్ చాలా తక్కువగా ఉండి కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ పనీర్ అనేది పాలాధారిత ఉత్పత్తి కావడం వల్ల ఇందులో ప్రోటీన్‌తో పాటు గుడ్ ఫ్యాట్స్, కేలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కఠినమైన క్యాలరీ డెఫిసిట్ డైట్ పాటించేవారికి చికెన్ ఎక్కువ మేలు చేస్తుంది.

1 / 5
వెజిటేరియన్ల సంజీవని: కేవలం ప్రోటీన్ పరంగా చికెన్ ముందున్నా.. పనీర్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను తక్కువ అంచనా వేయలేం. శాకాహారులకు పనీర్ ఒక అద్భుతమైన వరం. ఇందులో ప్రోటీన్‌తో పాటు పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో అవసరం. అలాగే పనీర్‌లో ఉండే కేలరీలు, ఫ్యాట్ వల్ల ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. త్వరగా ఆకలి వేయనివ్వదు. ఇందులో ఉండే విటమిన్ బి12, ఫాస్ఫరస్ శరీర జీవక్రియలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

2 / 5
మజిల్ బిల్డింగ్‌కు ఏది ముఖ్యం: జిమ్‌కి వెళ్లేవారు, బాడీ బిల్డింగ్ చేసేవారు కండరాల పెరుగుదల కోసం ఎక్కువగా లీన్ చికెన్‌ను నమ్ముకుంటారు. ఎందుకంటే చికెన్‌లో శరీరం త్వరగా గ్రహించగలిగే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. పైగా జీర్ణక్రియ రేటును పెంచడానికి ఇది తోడ్పడుతుంది. అయితే పనీర్‌లో కేసిన్ అనే స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఇది శరీరంలో మెల్లగా జీర్ణమవుతూ రాత్రంతా శరీరానికి ప్రోటీన్‌ను అందిస్తుంది. అందుకే చాలామంది ఫిట్‌నెస్ నిపుణులు రాత్రి పూట పనీర్ తినమని సముచితంగా సలహా ఇస్తుంటారు.

3 / 5
 చికెన్, పనీర్ రెండూ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. వీటిని ఎంచుకునేటప్పుడు మీ శరీర తత్వాన్ని కూడా గమనించాలి. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అలాంటి వారు పనీర్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. వీరికి చికెన్ బెస్ట్ ప్రత్యామ్నాయం. అలాగే యురిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు చికెన్‌ను కాస్త పరిమితంగా తీసుకోవాలి. వండే పద్ధతి కూడా ముఖ్యమే.. చికెన్ అయినా, పనీర్ అయినా ఎక్కువ నూనె, మసాలాలతో వండితే లాభాల కంటే నష్టాలే ఎక్కువ.

4 / 5
ఏది బెస్ట్: మీరు పూర్తి శాకాహారులైతే ఏమాత్రం ఆలోచించకుండా పనీర్‌ను మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు బరువు తగ్గడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని, నాన్ వెజ్ తినే వారైతే చికెన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. శరీరాకృతిని బట్టి, మీ జీవనశైలిని బట్టి వారంలో కొన్ని రోజులు చికెన్, కొన్ని రోజులు పనీర్ మార్చి మార్చి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us