AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

ఇప్పుడంటే మన దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేశారు కానీ.. ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ తోనే చాలా మంది హిడెన్ ట్యాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసింది. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన నటీనటులు చాలామందే ఉన్నారు.

Samantha: సమంతతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
Samantha
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2025 | 12:54 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ పాప ఒకప్పుడు టిక్ టాక్ స్టార్. తన రీల్స్, వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ పాపులారిటీతోనే సినిమాలు, సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ క్యూటీ 11 ఏళ్లకే వెండితెర కు పరిచయమైంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 50 కు పైగా సినిమాల్లో నటించింది. . ఒక సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకుంది అలాగే పదికి పైగా సీరియల్స్ లో బాల నటిగా మెప్పించింది. ఇక కొన్ని టీవీ షోస్ కు హోస్ట్ గానూ చేసిందీ అందాల తార. కొన్ని నెలల క్రితం సోలో హీరోయిన్ గా ఓ సినిమాలోనూ నటించింది.అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ కాస్త వెనకబడిపోయింది. అయితేనేం సోషల్ మీడియాలో ఈ సొగసరి కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామలుగా లేదు. ముఖ్యంగా ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. మరి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ టాలీవుడ్ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ప్రణవి మానుకొండ.

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ప్రణవి 11 ఏళ్ల ప్రాయంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. రొటీన్‌ లవ్‌స్టోరీ, ఉయ్యాలా జంపాలా సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది. మొత్తానికి 50 కు పైగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ప్రణవి. అలాగే ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా చేరువైంది. కాగా 2023లో స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాతో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది ప్రణవి. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక తన తర్వాతి సినిమా గురించి ఇంకా అప్ డేట్ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రణవి మానుకొండ లేటెస్ట్ ఫొటోస్..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణవికి ఇన్ స్టాలో 1.6 మిలియన్స్ కంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

గ్లామరస్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాక్ ఉగ్ర చర్యలను ఖండించిన MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ వేధింపులు?
పాక్ ఉగ్ర చర్యలను ఖండించిన MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ వేధింపులు?
'అల్లుడిలా కాకుండా కొడుకులా చూశా..కానీ'.. హీరోపై అత్త ఆరోపణలు
'అల్లుడిలా కాకుండా కొడుకులా చూశా..కానీ'.. హీరోపై అత్త ఆరోపణలు
కనిపించే పండ్లు అన్నీ మంచివి కావు.. జర కొనేముందు జాగ్రత్త..!
కనిపించే పండ్లు అన్నీ మంచివి కావు.. జర కొనేముందు జాగ్రత్త..!
ఫైనాన్స్ సంస్థల దూకుడు.. రిలయన్స్ నిప్పన్‌కు లాభాల పంట
ఫైనాన్స్ సంస్థల దూకుడు.. రిలయన్స్ నిప్పన్‌కు లాభాల పంట
హైదరాబాద్ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
తక్కువ ఖర్చుతో ఒత్తైన జుట్టు పెరగాలంటే.. వీటితో ఇలా చేయండి..!
తక్కువ ఖర్చుతో ఒత్తైన జుట్టు పెరగాలంటే.. వీటితో ఇలా చేయండి..!
ఈ పండు దొరికితే అస్సలు వదలొద్దు..తింటే శరీరంలోఅద్భుతాలు చేస్తుంది
ఈ పండు దొరికితే అస్సలు వదలొద్దు..తింటే శరీరంలోఅద్భుతాలు చేస్తుంది
ఈ యాడ్‌లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ యాడ్‌లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
పాకిస్తాన్ దొంగనాటకాలను ప్రపంచం ముందుకు తీసుకెళ్తాం: అసదుద్దీన్
పాకిస్తాన్ దొంగనాటకాలను ప్రపంచం ముందుకు తీసుకెళ్తాం: అసదుద్దీన్
కొత్త కారు కొంటున్నారా.. టాప్ 10 స్థానాల్లో ఉన్నవివే..
కొత్త కారు కొంటున్నారా.. టాప్ 10 స్థానాల్లో ఉన్నవివే..