- Telugu News Photo Gallery Cinema photos Is rajamouli changed for mahesh in giving freedom for ssmb29 movie shoot
ఏంటి! మహేష్ రూట్లోకి జక్కన్న వచ్చేశారా ?? అసలేం జరుగుతుంది మావా
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచీ ఓ లెక్క అనే మాట బాగా వినిపిస్తోంది రాజమౌళి కాంపౌండ్‌లో. టాలీవుడ్ టు ప్యాన్ ఇండియా జక్కన్న స్కెచ్ వేరు.. సెట్లోకి సూపర్‌స్టార్ ఎంట్రీ ఇచ్చాక ఆ రేంజ్ వేరు అని అంటున్నారు అబ్జర్వర్స్.. ఇంతకీ ఏంటా లెక్కల పరిస్థితి... ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచీ ఓ లెక్క అనే మాట బాగా వినిపిస్తోంది రాజమౌళి కాంపౌండ్‌లో. టాలీవుడ్ టు ప్యాన్ ఇండియా జక్కన్న స్కెచ్ వేరు.. సెట్లోకి సూపర్‌స్టార్ ఎంట్రీ ఇచ్చాక ఆ రేంజ్ వేరు అని అంటున్నారు అబ్జర్వర్స్.. ఇంతకీ ఏంటా లెక్కల పరిస్థితి...
Updated on: May 09, 2025 | 1:00 PM

మనల్నెవడ్రా ఆపేది అనే డైలాగ్.. అచ్చంగా పవన్ కల్యాణ్‌దే. కానీ, ఇప్పుడు మహేష్ యాటిట్యూడ్‌కి ఈ డైలాగ్ పక్కాగా సరిపోతుందంటున్నారు క్రిటిక్స్. ఎట్ ప్రెజెంట్ ఉన్నది రాజమౌళి సెట్లో అయినా. తనకు కావాల్సినప్పుడు కావాల్సినంత ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూపర్‌స్టార్.

పాస్‌పోర్టు తీసుకున్నానని రాజమౌళి హింట్ ఇస్తే.. పాస పోర్టు చూపిస్తూ ఎయిర్‌పోర్టులో స్మైల్ ఇచ్చేశారు మహేష్. అదికూడా జస్ట్ ఒన్ టైమా? అంటే నో.. నో.. మళ్లీ మళ్లీ. ఇప్పుడు కూడా షూటింగ్ గ్యాప్‌లోనే ఉన్నారు సూపర్‌స్టార్.

మహేష్ కోసం షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారా? లేకుంటే వచ్చిన గ్యాప్‌ని మహేష్ అలా వాడుకుంటున్నారా? విషయం ఏదైనా.. రాజమౌళి రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా కనిపిస్తోంది సిట్చువేషన్.

టాలీవుడ్ టు ప్యాన్ ఇండియా ట్రావెల్‌లో హీరోలందరూ రాజమౌళి మాటే విన్నారు. కానీ మహేష్ మాత్రం.. తన రూట్లోకి రాజమౌళిని రప్పించేశారన్నది ఘట్టమనేని అభిమానులు ఆనందంగా చెబుతున్న మాట.

జూన్ పది నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్క అప్‌డేట్ గురించీ ఇప్పటిదాకా నోరు విప్పలేదు జక్కన్న. కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇంటర్నేషనల్ లెవల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. దాన్ని రీచ్ అయ్యాక అన్నీ మాట్లాడుకుందామన్నది రాజమౌళి ప్లాన్ అట.




